బుధవారం 15 జూలై 2020
Rajanna-siricilla - Jun 21, 2020 , 00:51:08

మొక్కలతోనే మనుగడ

మొక్కలతోనే మనుగడ

  • లక్ష్యం మేరకు నాటి సంరక్షించాలి
  • మండలాన్ని ఆదర్శంగా నిలపాలి
  • చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
  • మండల పరిషత్‌లో హరితహారంపై సమీక్ష

బోయినపల్లి: మొక్కలతోనే మానవాళి మనుగడ సాధ్య మని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌ అధ్యక్షతన మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ అటవీ సంపదను సమైక్య పాలకులు కొల్లగొట్టి విధ్వంసం చేయడంతో సీఎం కేసీఆర్‌ హరితహారాన్ని ప్రవేశపెట్టారన్నారు. గ్రామాల్లో లక్ష్యం మేరకు మొక్కలు నాటి మండలాన్ని జిల్లాలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ బాధ్యతగా సంరక్షించాలని కోరారు. జీవకోటికి చెట్లే ప్రాణవాయువని రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఆరేళ్ల క్రితం ఆగస్టు వరకు కూడా వర్షాలు పడేవి కాదని, ప్రస్తుతం జూన్‌ నెలలోనే విస్తారంగా పడుతున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ప్రతిపక్షాలు 70యేండ్ల పాలనలో హరితహారం, ప్రజా సంక్షేమ పథకాలను ఎందు కు  అమలు చేయలేదని ప్రశ్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో పండ్లు, పూల మొక్కలను నాటాలని కోరారు. పచ్చదనంతో పల్లెలు కళకళలాడుతున్నాయని తెలిపారు. 

బస్‌పాస్‌లు పంపిణీ

దివ్యాంగులకు 50శాతం రాయితీపై అందించే బస్‌పాస్‌లను కరీంనగర్‌కు చెందిన నీరజ తన పుట్టిన రోజు సందర్భంగా ఆర్టీసీకి చెల్లించారు. అనంతరం దివ్యాంగులకు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే రవిశంకర్‌ చేతులమీదుగా బస్‌పాస్‌లు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, జడ్పీటీసీ కత్తెరపాక ఉమ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కవ్వంపల్లి లక్ష్మి, టీఆర్‌ఎస్‌ నేత కత్తెరపాక కొండయ్య, ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎంఈవో శ్రీనివాస్‌, ఏవో మహేశ్వరి, ఏపీఎం నర్స య్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ స్రవంతి, సర్పంచులు గుంటి లతశ్రీ, బూర్గుల నందయ్య, చిందం రమేశ్‌, ఎంపీటీసీలు అక్కెనపల్లి ఉపేందర్‌, నాయకులు శంకర్‌, రాములు, మధు, తదితరులున్నారు.


తాజావార్తలు


logo