సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Jun 18, 2020 , 00:59:54

గింజలు పెడుతూ.. ఎరువులు తరలిస్తూ..

గింజలు పెడుతూ.. ఎరువులు తరలిస్తూ..

n సాగు పనుల్లో రైతన్న బిజీబిజీ

n పెరగనున్న పంటల విస్తీర్ణం n అందుబాటులో ఎరువులు, విత్తనాలు

n పెరగనున్న పంటల విస్తీర్ణం

n అందుబాటులో ఎరువులు, విత్తనాలు

ఇల్లంతకుంట: తొలకరి పలకరించింది.. రైతాం గం మురిసింది. వారం నుంచి సమృద్ధిగా వాన లు పడుతుండడంతో అన్నదాతల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. సీఎం కేసీఆర్‌ ఆలోచనా విధానానికి అనుగుణంగా నియంత్రిత పంటలు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇదివరకే దున్నిన దుక్కుల్లో కొందరు పత్తి గింజలు పెడుతుండగా, మరికొందరు నార్లు పోస్తూ, పొలా ల్లో ఎరువులు చల్లుకుంటూ సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. అలాగే మండలానికి ఈ ఏడాది కాళేశ్వరం జలాలు చేరుకోవడంతో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. 12,800 హెక్టార్లలో వరి, 23వేల హెక్టార్లలో పత్తి, 870హెక్టార్లలో కంది, 365హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉం చామని వ్యవసాయాధికారులు తెలిపారు.

నకిలీ విత్తనాలతో జాగ్రత్త

రైతులు విత్తనాలు కొనేటప్పు డు జాగ్రత్తలు పాటించాలి. విత్తనాలు అమ్ముతున్న దుకాణాలకు లైసెన్స్‌ ఉందా? లేదా? అని గమనించి ప్రభు త్వం ఆమోదించిన విత్తనాలే కొనాలి. అనుమతి లేని విత్తనా లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. అలాగే రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలి.

- తిరుపతి, ఏవో, ఇల్లంతకుంట