సోమవారం 06 జూలై 2020
Rajanna-siricilla - Jun 18, 2020 , 00:59:52

శరవేగంగా పూర్తవుతున్న రెండు పడక గదుల ఇండ్లు

శరవేగంగా పూర్తవుతున్న రెండు పడక గదుల ఇండ్లు

n నెరవేరనున్న పేదింటి సొంత కల

n తుది దశకు 326ఇండ్ల నిర్మాణాలు

n  సర్వత్రా హర్షం

పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలు తుదిదశకు చేరుకుంటున్నాయి. సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణతో మండలంలో 326 ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తికావస్తున్నాయి. మిగతా గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాల కోసం స్థలాన్ని సేకరించి పనులు ప్రారంభించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

మండల కేంద్రంలో మొదటి విడుతగా 168, రెండో విడుతలో 100ఇండ్లు, లింగన్నపేటలో 38, నర్మాలలో 20 ఇండ్లు మంజూరయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. మొదట్లో స్థల సేకరణకు క్షేత్ర స్థాయిలో కొంత ఇబ్బంది అయినా స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో లక్ష్యా న్ని చేరుకుంటున్నారు. మండల కేంద్రంలో ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం మురుగు కాలువలు నిర్మిస్తున్నారు. చివరిగా సీసీ రోడ్లు యుద్ధప్రాతిపదికన నిర్మిస్తే పేదింటి కుటుంబాలకు ఇండ్లు అందుబాటులోకి రానున్నాయి.

పేదలకు వరం..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ ప్రభు త్వం చేపడుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు పేదలకు వరం గా మారాయి. బంగారు తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం గ్రామాల వారీగా పేదల సొం తింటి కల నెరవేర్చుతున్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను మంజూరు చేసి దశల వారీగా పూర్తి చేయడంతో ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సకల హంగులతో ఇండ్లు

ప్రభుత్వం పేదలకు సకల హంగులతో నాణ్యతలో రాజీ లేకుండా డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని నిర్మించి ఇస్తున్నది. గదుల్లో వెంటిలేషన్‌ కోసం విశాలమైన కిటికీలు, నాణ్యమైన పరికరాలతో ఎలక్ట్రిషన్‌, వాటర్‌ సప్లయ్‌ అందిస్తున్నది. స్వచ్ఛమైన తాగు నీరు అందించే మిషన్‌ భగీరథ ట్యాంకు లు, కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపడుతున్నారు.

అర్హులందరికీ ఇండ్లు

పేదలకు ప్రభుత్వం మంజూరు చేసి న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను గుత్తే దారులు త్వరితగతిన పూర్తి చేస్తు న్నారు. పూర్తయిన ఇండ్లను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం. ఆ దిశగా సమష్టి కృషితో మంజూరైన ఇండ్లను పూర్తి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. 

- వంగ కరుణ, ఎంపీపీ, గంభీరావుపేట

తుది దశకు నిర్మాణాలు

ఇండ్ల నిర్మాణాల్లో నాణ్యతలో లోపించకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నాం. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే వినియోగంలోకి తీసుకువస్తాం. 

- ఫణిందర్‌రెడ్డి, ఏఈ, గంభీరావుపేట 


logo