బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - Jun 17, 2020 , 02:19:45

కల్నల్‌ సంతోశ్‌బాబు మృతితో ‘పేట’లో విషాదఛాయలు

కల్నల్‌ సంతోశ్‌బాబు మృతితో ‘పేట’లో విషాదఛాయలు

l  కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రముఖులు 

l  కొవ్వొత్తులతో నివాళులర్పించిన ఆర్యవైశ్యులు  

బొడ్రాయిబజార్‌ : తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి బిక్కుమళ్ల సంతోశ్‌బాబు మిలటరీలో కల్నల్‌ స్థాయికి ఎదిగి చైనా-భారత్‌ సరిహద్దులో దేశం కోసం వీరమరణం పొందడాన్ని సూర్యాపేట జిల్లా, పట్టణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సంతోశ్‌ మృతి వార్తతో స్థానిక విద్యానగర్‌లోని  ఆయన నివాసానికి ప్రజలు భారీగా చేరుకున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో రోదిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌తోపాటు పలువురు సంతోశ్‌బాబు నివాసానికి వెళ్లి ఆయన తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు.  సంతోశ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో టీఆర్‌ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్‌ ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, ఉప్పల ఆనంద్‌, కీసర వేణుగోపాల్‌రెడ్డి, గోనె అశోక్‌ తదితరులు ఉన్నారు.  

కొవ్వొత్తులతో నివాళులు..  

కల్నల్‌ సంతోశ్‌బాబు ఆత్మకు శాంతి కలుగాలని కోరుతూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంతోశ్‌ మృతి దేశానికి తీరని లోటన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మండ్లపల్లి మురళీధర్‌, ఎన్‌.విద్యాసాగర్‌, ఈగా దయాకర్‌, గోపారపు రాజు, మీలా వంశీ, కలకోట లక్ష్మణ్‌, బొమ్మిడి లక్ష్మీనారాయణ, దేవరశెట్టి సత్యనారాయణ, ఉమారాణి, బిక్కుమళ్ల వెంకటేశ్వర్లు, మనసాని నాగేశ్వర్‌రావు, మిట్టపల్లి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. logo