గురువారం 16 జూలై 2020
Rajanna-siricilla - Jun 14, 2020 , 01:29:27

ఆరేండ్లలోని అభివృద్ధి కనిపించడం లేదా

ఆరేండ్లలోని అభివృద్ధి కనిపించడం లేదా

  • n దీక్షలతో  ప్రజల మన్ననలు పొందలేరు
  • n టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు  పాపాగారి వెంకటస్వామిగౌడ్‌
  • n పార్టీ శ్రేణులతో సమావేశం

గంభీరావుపేట: దీక్షల పేరిట నాటకాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, ఆరేండ్లలో జరిగిన అభివృద్ధి కండ్లకు కనిపించడం లేదా.. అంటూ టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్‌ కాంగ్రెస్‌ నాయకులపై మండి పడ్డారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం మండల నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివిధ ప్యాకేజీల ద్వారా పనులు పూర్తి చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎగువ మానేరుకు వచ్చే 9వ ప్యాకేజీ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతుం టే కాంగ్రెస్‌ నేతలకు కనిపించకపోవడం విచారకరన్నారు. మంత్రి కేటీఆర్‌, అధికారుల సమీక్షల మధ్యన నర్మాల ఎగువ మానేరుకు వచ్చే 9వ ప్యాకేజీ పనులు వేగంగా జరుగుతున్నా ప్రతిపక్షాలు లబ్ధి కోసమే దీక్షలు చేయడం మానుకోవాలని సూచించారు. దీక్షలతో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తే సహించమని హెచ్చరించారు. వచ్చే అక్టోబర్‌ వరకు మానేరుకు గోదావరి జలాలతో యాసంగి సాగునీరందిస్తానని మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన హామీపై ఈ ప్రాంత రైతులకు నమ్మకం ఉందన్నారు. పను లు జరుగుతున్నా లబ్ధి కోసమే విమర్శలు చేయడం మానుకొని అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కొత్తపల్లి సింగిల్‌విండో చైర్మన్‌ భూపతి సురేందర్‌, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ రాజేందర్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు అహ్మద్‌, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్‌, వంగ సురేందర్‌రెడ్డి, కమ్మరి రాజారాం, గంద్యాడపు రాజు, నారాయణరావు, బాలవ్వ, బిల్లా రాజు, కమటం రాజేందర్‌, నాగరాజుగౌడ్‌, మల్లేశం, దోసల రాజు, లింగం, రాజనర్సు, ఎగదండి స్వామి, అభిలాష్‌ తదితరులు ఉన్నారు.logo