శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Jun 14, 2020 , 01:24:49

కాంగ్రెస్‌ నేతతో ప్రాణ భయం..

కాంగ్రెస్‌ నేతతో ప్రాణ భయం..

  •  ఏఎంసీ మాజీ చైర్మన్‌ డప్పుల అశోక్‌ n  పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

చందుర్తి: కాంగ్రెస్‌ నాయకుడు ఆది శ్రీనివాస్‌ తో తనకు ప్రాణభయం ఉందని రుద్రంగి మా ర్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ డప్పుల అశోక్‌ శనివారం చందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా డు. అనంతరం ఆయన స్థానిక ప్రజాప్రతినిధుల తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన రాత్రి 11గంటల సమయంలో తన మిత్రుడితో చందుర్తి పోలీస్‌స్టేషన్‌ నుంచి బైక్‌పై లింగంపేటకు వస్తుండగా కొందరు కారులో వెంబడించారని పేర్కొన్నారు. మల్యాల శివారులోని చర్చి ప్రాంతంలో హత్య చేసేందుకు యత్నిస్తున్నారనే అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్‌ఐ సునీల్‌ తమను క్షేమంగా ఇంటికి చేర్చారని వివరించారు. 15రోజుల క్రితం కొంద రు తమ పొలం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారని తెలిపారు. దళితుల భూము ల రక్షణ విషయమై ఏడేండ్ల క్రితం ఆది శ్రీనివాస్‌పై కేసు పెట్టామన్నారు. ఇప్పుడు ఆ కేసు అతడి రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారుతుందని తన హత్యకు కుట్ర చేస్తున్నాడని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ సునీల్‌ను వివరణ కోరగా, విచారణ చేపడుతామని తెలిపారు. 


logo