మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Jun 14, 2020 , 01:24:50

ఎస్సారార్‌లో చేపలు పట్టుకోవచ్చు

ఎస్సారార్‌లో చేపలు పట్టుకోవచ్చు

  • మత్స్యకారులు దరఖాస్తు చేసుకోవాలి n అదనపు కలెక్టర్‌ అంజయ్య

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అదనపు కలెక్టర్‌ అంజయ్య తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఆయన అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మత్స్యశాఖ జీవో నంబర్‌ 1ని అనుసరించి ఇప్పటి వరకు జలాశయం ప్రాంతాల్లో 2,450మంది మత్స్యకారులకు లైసెన్సులు జారీ చేసినట్లు తెలిపారు. మత్స్యకారుల జాబితా రూపొందించడం కోసం ప్రస్తుతం రెవెన్యూ, మత్స్యశాఖ సిబ్బంది తో ఐదు టీంలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జలాశయం పరిధిలో 10కిలోమీటర్ల దూరంలో ఉన్న 44గ్రామాలు, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను సందర్శించి సర్వే నిర్వహిస్తారని చెప్పారు. చేపలు పట్టడంలో నైపుణ్యం ఉన్నవారు, ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. జలాశయంలో భూమిని కోల్పోయిన నిర్వాసితు లు, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీవాసులు, 10కిలోమీటర్ల లోపు నివసించే మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు లైసెన్సులు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 15నుంచి 20వ తేదీ వరకు జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రాజెక్టులో భూమి కోల్పోయినట్లు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ పత్రాలను సర్వే సిబ్బందికి అందించాలని కోరారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసరావు, మత్స్యశాఖ అధికారి ఖదీర్‌ అహ్మద్‌, అధికారులు ఉన్నారు.