గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jun 14, 2020 , 01:08:52

రాజన్న ఆలయ ఈవోగా కృష్ణప్రసాద్‌ బాధ్యతల స్వీకరణ

రాజన్న ఆలయ ఈవోగా కృష్ణప్రసాద్‌ బాధ్యతల స్వీకరణ

వేములవాడ కల్చరల్‌: రాజన్న ఆలయ ఈవోగా కృష్ణప్రసాద్‌ శనివారం  సాయం త్రం బాధ్యతలు స్వీకరించారు. రాజన్న ఆలయ ఇన్‌చార్జి దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన రామకృష్ణ, ఈనెల7న రాజన్న ఆలయ ఈవోగా చార్జ్‌ తీసుకున్నారు. 6 రోజులు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం రామకృష్ణ నుంచి కృష్ణప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. కాగా కృష్ణప్రసాద్‌ ప్రస్తుతం కొండగట్టు ఆలయానికి కూడా ఇన్‌చార్జి ఈవోగా వ్యవహరిస్తున్నారు. 


logo