శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Jun 12, 2020 , 02:26:11

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ కల్చరల్‌ : వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం గురువారం భక్తులతో రద్దీగా  కనిపించింది. భక్తులు భౌతికదూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ప్రాతఃకాల పూజల అనంతరం 6 గంటల నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో భక్తులు భౌతికదూరం పాటిస్తూ క్యూ కట్టారు.  ప్రతి భక్తుడూ, భక్తురాలు విధిగా మాస్కు ధరించాలని మైక్‌లో అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేశారు. ఆలయం తూర్పు ద్వారం వద్ద ఏర్పాటు చేసిన డిసిన్ఫెక్షన్‌ టన్నెల్‌ నుంచి భక్తులు లోపలికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రతిచోటా సిబ్బంది శానిటైజేషన్‌ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆలయం లోపలికి అనుమతించారు. స్వామివారిని 1,945 మంది దర్శనం చేసుకున్నట్లు, 2,915 లడ్డూ ప్రసాదాల ద్వారా రూ.58,300, 412 పులిహోర ప్యాకెట్ల విక్రయం ద్వారా రూ.6,180, మొత్తం ఆదాయం రూ.64,480 సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.


logo