సోమవారం 06 జూలై 2020
Rajanna-siricilla - Jun 11, 2020 , 03:01:34

తెలంగాణ సోనా.. లాభాలు శానా

తెలంగాణ సోనా..  లాభాలు శానా

l సన్నరకాల్లో ఉత్తమ వెరైటీ lయాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి

l చక్కెర పదార్థాల శాతం తక్కువ  lమధుమేహ రోగులకు మంచి ఆహారం 

బియ్యం గింజ సైజు 6.3 మిల్లీ మీటర్లకు మించి ఉంటే అంతరాత్జీయ మార్కెటో ్ల డిమాండ్‌ ఉంటుంది. మన దగ్గర అంత సైజు వస్త లేదు. అందుకే ఈసారి వ్యవసాయ విశ్వ విద్యాలయానికి ఒక మాండేట్‌ ఇచ్చినం. 6.5 మిల్లీ మీటర్లకు మించి ఉండే వంగడాలను సృష్టించి ఇవ్వాలని చెప్పినం. ఉదాహరణకు తెలంగాణ సోనా అనేది తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయం. ఈ రకానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్‌ ఉన్నది. ఇందులో షుగర్‌ పరిమాణం తక్కువగా ఉన్నదని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చిన్రు. అంతర్జాతీయ, అమెరికా జర్నల్స్‌లో ప్రచురించిన్రు. తెలంగాణ సోనా రకం హాట్‌ కేక్‌లా అమ్ముడు పోతున్నందున ఈసారి పది లక్షల ఎకరాల్లో వేయాలని చెప్పినం. రేపటికి ఇంకా విస్తీర్ణాన్ని పెంచుతం.

2014లో విత్తనం విడుదల.. 

తెలంగాణ సోనా మసూరి.. వరి సన్నరకాల్లో ఒకటి. ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 అని కూడా వాడుకలో ఉన్నది. ఈ వంగడాన్ని జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎంటీయూ 1010 రకంలో నుంచి ఆడజన్యువు, జేజీఎల్‌ 3855 రకంలో నుంచి మగ జన్యువుతో సంపర్కం చేసి ఆర్‌ఎన్‌ఆర్‌ అనే కొత్త రకాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. అయిదారేళ్ల పరిశోధన అనంతరం 2014లో తెలంగాణ సోనా రకాన్ని విడుదల చేశారు. 

చీడ పీడల బెడద తక్కువ 

ఆర్‌ఎన్‌ఆర్‌ వరిరకానికి చీడపీడల బెడద చాలా తక్కువ. ముఖ్యంగా వరిపంటకు ఎక్కువగా ఆశించే అగ్గితెగులు, దోమకాటును ఈ రకం తట్టుకుంటుంది. యూరియా తక్కువ వాడకం వల్ల అగ్గితెగులు బాధ నుంచి ఉపశమనం ఉంటుంది. దీర్ఘకాలిక పంటలకు ఎక్కువగా దోమకాటు వస్తుంది. ఇదిస్వల్పకాలిక పంట కావడంతో దోమ ఉధృతి పెరిగే సమయంలోనే కోతకు వస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు 

ఈ రకం బియ్యంతో వండిన అన్నం మధుమేహ వ్యాధితో బాధ పడేవారికి ఎంతో మేలు చేస్తుంది. మిగతా రకాలతో పోల్చుకుంటే తెలంగాణ సోనాలో కార్బోహైడ్రేట్స్‌ (పిండి పదార్థాలు ) తక్కువ. మిగతా కొన్ని రకాల్లో 60 శాతం పైగానే ైగ్లెసోమిట్‌ ఇండెక్స్‌ ఉంటుంది. తెలంగాణ సోనాలో మాత్రం 51.5 శాతం మాత్రమే ైగ్లెసోమిట్‌ ఇండెక్స్‌ ఉంటుందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అనే సంస్థ కూడా నిర్ధారించింది. 55 శాతం కంటే తక్కువ ైగ్లెసోమిట్‌ ఇండెక్స్‌ ఉన్న పదార్థాలు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందని వైద్యులు కూడా పేర్కొంటున్నారు. వడ్లను మరపట్టేటప్పుడు పాలిష్‌ తక్కువగా వేస్తే మరో రెండుశాతం జీఐ తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి

తెలంగాణసోనా రకం సాగుచేసినపుడు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈరకం వరికి 120 నుంచి 125 రోజుల వరకు కాలపరిమితి ఉంటుంది. సాగు సమయాలు పాటించకపోవడంతో కోతకు వచ్చే సమయం పెరుగుతుంది. వానకాలం జూలై మొదటివారంలో నారు పోస్తే అక్టోబర్‌ చివరలో లేదా నవంబర్‌ మొదటి వారంలో పంటచేతికి వస్తుంది. చాలామంది రైతులు రోహిణీ కార్తెలో నారుపోయడం వలన 150 రోజుల తర్వాతనే కోతకు వస్తుంది. అదే యాసంగిలో డిసెంబర్‌ మొదటి వారంలో నారు అలుకుడు చేస్తే మార్చిచివరలో, ఏప్రిల్‌ మొదటి వారంలో పంట చేతికి వస్తుంది. అదే నవంబర్‌ లోపల నారుపోయడం వల్ల 145 రోజుల తర్వాత పంట వస్తుంది. నారు అలికేందుకు సమయపాలన పాటిస్తే దిగుబడి 28 క్వింటాళ్లకు పైగానే వస్తుంది. దీనిని సీఎం కేసీఆర్‌ కూడా ఒక రైతుగా కొన్నేళ్ల నుంచి పదెకరాలకు తక్కువ కాకుండా ఏటా సాగుచేస్తున్నారు.

- దోమ ఆదిరెడి,్డ ఏడీఏ 

ఎరువులు తక్కువగా వాడాలి

మిగతా పంటలతో పోలిస్తే దీనికి సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువులను తక్కువగా వాడాలి. ఇది 100 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇతర రకాలతో పోల్చుకుంటే పది సెంటీమీటర్లు ఎక్కువ. ఎకరానికి డీఏపీ 40 నుంచి 50 కిలోలు ఒకసారి, యూరియా మూడు దఫాలుగా ప్రతిసారి 50 కిలోలు మామూలుగా వాడుతుంటారు. దీర్ఘకాలిక పంటలకైతే యూరియా మరోసారి అదనంగా ఉపయోగిస్తారు. వీటి మాదిరిగానే ఆర్‌ఎన్‌ఆర్‌కు వాడితే పంట మరింత ఎత్తు పెరిగి బలమైన గాడుపులకు పంటమెత్తం నేలవారే అవకాశం ఉన్నది. కనుక 30 కిలోలు మాత్రమే ప్రతి దఫాకు వాడితే మంచి ఫలితం ఉంటుంది. 

- నీలం వెంకటేశ్వర్లు, 

కేవీకే శాస్త్రవేత్త, జమ్మికుంట



logo