గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jun 11, 2020 , 02:07:03

అభివృద్ధిని చూసి..గులాబీ గూటికి

అభివృద్ధిని చూసి..గులాబీ గూటికి

n పలువురు నేతలతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎగదండి స్వామి

n కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌

గంభీరావుపేట: మంత్రి కేటీఆర్‌ సమక్షంలో కాం గ్రెస్‌ మండలాధ్యక్షుడు ఎగదండి స్వామి టీఆర్‌ఎస్‌లో చేరారు. మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ నేతలకు టీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు  స్వామితోపాటు వార్డు సభ్యురాలు ఎగదండి అరుంధతి, నేత లు కొండం బాల్‌రాజు, గంద్యాడపు రమేశ్‌, సత్యం, ప్రభాకర్‌, రమేశ్‌, పర్శరాములు, రవి, దేవయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూడాలని కేటీఆర్‌ వారికి సూచించారు. కేసీఆర్‌ సర్కార్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారని ఎగదండి స్వామి పేర్కొన్నారు.

 కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

మండల పరిషత్‌ సమావేశానికి ముందు మంత్రి కేటీఆర్‌ 49మంది లబ్ధిదారులకు రూ.48.56లక్షల విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. “మీ బిడ్డల పెండ్లి చేసి ఎన్ని రోజులు అయింది .. ప్రభుత్వం తొందరగానే కల్యాణ లక్ష్మి పైసలు ఇస్తుందా.. అంటూ లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్‌ ముచ్చటించారు. అంతకుముందు ప్రభుత్వం ఇచ్చి న భూమికి సంబంధించిన పత్రాలను ముస్తాబాద్‌ మండలం మద్దికుంటలోఐదుగురు మోహినికుంట వాసులకు మంత్రి కేటీఆర్‌ అందించారు.


logo