మంగళవారం 07 జూలై 2020
Rajanna-siricilla - Jun 11, 2020 , 02:05:28

రైతును రాజు చేయడమే లక్ష్యం

రైతును రాజు చేయడమే లక్ష్యం

nజడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ nకొలువుదీరిన రుద్రంగి మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం

రుద్రంగి : రైతును రాజు చేయడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ అన్నారు. బుధవారం రుద్రంగి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పొన్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌గా ఆకుల భూమక్క, డైరెక్టర్లుగా దయ్యాల నారాయణ, గుగులోత్‌ శ్యాంసుందర్‌, దొంగరి లక్ష్మీరాజం, ఎండీ ఇస్మాయిల్‌, లింగాల మల్లయ్య, వెంకటరాంరెడ్డి, శ్రీనివాస్‌, పోతురాజు నాగేశం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి జడ్పీ అధ్యక్షురాలు  అరుణ ముఖ్య అతిథిగా హాజరై నూతన సభ్యులకు  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.. మెట్ట ప్రాంతమైన రుద్రంగి, చందుర్తి మండలాలకు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వమన్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు కృషితోనే నియోజకవర్గంలో 40 వేల ఎకరాల్లో భూములకు సాగు నీరు అందుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతులు నియంత్రిత వ్యవసాయం చేసి ఆర్థికంగా ఎదగాలన్నారు. అనంతరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొన్నాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ మార్కెట్‌ యార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, జగిత్యాల జిల్లా జడ్పీ వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌, వేములవాడ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఏనుగు మనోహర్‌రెడ్డి, ఎంపీపీలు గంగం స్వరూపరాణి, బైరగోని లావణ్య, జడ్పీటీసీలు గట్ల మీనయ్య, నాగం భూమయ్య, సింగిల్‌విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్‌, జలగం కిషన్‌రావు, వైస్‌ ఎంపీపీ పీసరి భూమయ్య, ఎంపీటీసీ లావణ్య పాల్గొన్నారు. 


logo