సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Jun 10, 2020 , 02:23:16

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

n రెండో రోజూ  లఘు దర్శనం  

n భౌతిక దూరం పాటించిన భక్తులు

n ఏర్పాట్లను  పరిశీలించిన ఆలయ ఈవో 

వేములవాడ కల్చరల్‌ : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం  భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం ప్రాతఃకాల పూజల అనంతరం 6 గంటల నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులు భౌతిక దూరం పాటించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయం తూర్పు ద్వారం వద్ద ఏర్పాటు చేసిన డిసిన్ఫెక్షన్‌ టన్నెల్‌ నుంచి లోపలికి ప్రవేశించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష చేసి వారిని అనుమతించారు. అస్వస్థత ఉన్న వారిని అనుమతించలేదు. సాయంత్రం 5గంటలవరకు దాదాపు 1500 మంది  దర్శనం చేసుకున్నట్లు, 1800 లడ్డూ ప్రసాదాలు, 412 పులిహోర ప్యాకెట్లు విక్రయించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా  రాజన్న ఆలయ ఈవో రామకృష్ణ ఆలయ పరిసరాలను, ఆలయ వసతి గదులను పరిశీలించారు. ఈవో వెంట ఆలయ పర్యవేక్షకులు కాంచనపెల్లి నటరాజ్‌, సిరిగిరి శ్రీరాములు, పట్టణ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. 

ఆన్‌లైన్‌ పూజలు 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొద్దిరోజులుగా రాజన్న ఆలయంలో భక్తుల ఆన్‌లైన్‌ సేవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయం తెరిచినా దేవాదాయ శాఖ అధికారులు ఆర్జిత సేవలకు అనుమతివ్వకపోవడంతో భక్తులు ఆన్‌లైన్‌లో  బుక్‌ చేసుకుని పూజలు చేయించుకుంటున్నారు. ఈ క్రమం లో మంగళవారం ఉద యం కోడెమొక్కు పూజలను ఆలయ అర్చకులు  నిర్వహించారు.