గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Jun 06, 2020 , 01:05:36

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు

 మంథనిటౌన్‌: ఉమ్మడి జిల్లాలో జరిగిన  వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు గాయపడ్డారు. మంథనిలోని జ్యోతిబాఫూలే విగ్రహం వద్ద ట్రాక్టర్‌, కారు ఢీ కొన్న  ఘటనలో పర్వతాలు గాయపడ్డాడు. ఆయ న కారులో గోదావరిఖని రహదారి నుంచి బస్టాం డ్‌వైపు  వస్తున్నాడు. ఈ క్రమంలో మంథని పద్మ శాలీ వీధి నుంచి వస్తున్న ట్రాక్టర్‌  ఫూలే విగ్ర హం వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో కారులో ఉన్న పర్వతాలు  తీవ్రంగా గాయ పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు  మంథని ఎస్‌ఐ ఓంకార్‌యాదవ్‌ ఘటనాస్థలానికి చేరుకొని  క్షతగాత్రుడిని పోలీసు వాహనంలో వైద్యశాలకు తరలించారు.

 ఆర్టీసీ బస్సు ఢీకొని..

చొప్పదండి: మండలంలోని కొలిమికుంటలో ఆర్టీ సీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటన లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.  గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న బస్సు కొలిమికుంట వద్ద  మో పెడ్‌పై పొలానికి  వెళ్తున్న సత్తు వీ రమల్లును ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో వీరమల్లు గాయపడగా దవాఖానకు తరలించారు.  

  యువకుడిపై హత్యాయత్నం 

మల్యాల: మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు మరో యువకుడిపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మండలంలోని మ్యాడంపల్లిలో గురువారం రాత్రి జరిగింది.  ఐస్‌ఐ నాగరాజు తెలిపిన వివరా ల ప్రకారం.. మ్యాడంపల్లికి చెందిన పిట్టల సుదర్శన్‌, పిట్టల రవి  వరుసకు అన్నదమ్ములు.  రవి ఇటీవలే ఉపాధి కోసం  కొడిమ్యాలకు వెళ్లాడు. మూ డు రోజుల క్రితం ఇంటికి వచ్చిన ఆయన తన ఇంటిపక్కనే గల సుదర్శన్‌ కుటుంబసభ్యులను దూషించాడు. తమను అకారణంగా తీడుతున్నాడని సుదర్శన్‌ గురువారం రాత్రి మద్యంమత్తులో రవితో గొడవకు దిగాడు. కోపోద్రిక్తుడైన  రవి తన ఇంటి నుంచి  పదునైన ఆయుధాన్ని తీసుకువచ్చి దాడి చేయగా సుదర్శన్‌ తీవ్రంగా గాయపడ్డాడు.  కాగా సుదర్శన్‌ భార్య పిట్టల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.


logo