గురువారం 16 జూలై 2020
Rajanna-siricilla - Jun 06, 2020 , 01:05:34

జల్సాల కోసం గంజాయ్‌ విక్రయం

జల్సాల కోసం గంజాయ్‌ విక్రయం

 ఐదు కిలోల గంజాయి,  రూ. 20 వేల నగదు,  కారు స్వాధీనం

ముగ్గురు విక్రేతల అరెస్ట్‌,  పరారీలో మరొకరు

నిందితులందరూ విద్యార్థులే

మానకొండూర్‌: జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాందించాలనే ఆశతో ముగ్గురు విద్యార్థులు గంజాయిని విక్రయిస్తూ  పోలీసులకు పట్టుబడి కటకటాలపాలయ్యారు.  ఇతర ప్రాంతాలనుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని కొ నుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న  ఓ ము ఠాను మానకొండూర్‌ పోలీసులు ఆదుపులోకి తీ సుకున్నారు. వారి వద్ద నుంచి  5కిలోల గంజాయితో పాటు 20 వేల నగదు, కారును స్వాధీ నం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం  ఠాణాలో  ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సంతోష్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. మండల కేం ద్రంలోని చెరువుకట్ట వద్ద   పోలీసులు శుక్రవారం   వాహనాలను తనిఖీ చేస్తుండగా వరంగల్‌కు చెం దిన  ముగ్గురు యువకులు  స్విఫ్ట్‌కారులో గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.  వీరిని విచారించగా ఇతర ప్రాంతాలనుంచి గంజాయిని కొనుగోలు చేసి కరీంనగర్‌, తిమ్మాపూర్‌, మానకొండూర్‌, వరంగల్‌ తదితర ప్రాంతాలలో యువకులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. ఇందులో భాగంగా  ఈనెల 3న వరంగల్‌ లో కారును అద్దెకు తీసుకుని 4న  ఆదిలాబాద్‌ కు వెళ్లి  అక్కడే 10 కిలోల గంజాయిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అదిలాబాద్‌నుంచి తిరిగి వ చ్చే క్రమంలో 5కి లోల  గంజాయిని మార్గమాద్యంలో విక్రయించామని, 200 గ్రాముల గంజాయిని తిమ్మాపూర్‌కు చెందిన  ఓ వ్యక్తికి విక్రయించినట్లు వెల్లడించారు.   స్వాధీనం చేసుకున్న ఐదు కిలోల గంజాయి, 20 వేల నగదు, కారును  తహసీల్దార్‌ రాజయ్య సమక్షంలో పంచనామా నిర్వహించి  ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుంటామని సీఐ చెప్పారు.


logo