మంగళవారం 07 జూలై 2020
Rajanna-siricilla - Jun 06, 2020 , 01:01:39

నమ్మించి..నగదు మాయం చేసి..

నమ్మించి..నగదు మాయం చేసి..

సైబర్‌ ఉచ్చులో జమ్మికుంట హాటల్‌ యజమాని 

 టిఫిన్స్‌ కావాలని ఫోన్‌ 

డబ్బులు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేస్తానని.. 

ఏటీఎం ఓటీపీ చెప్పాలని నమ్మబలికిన అపరిచితుడు  

 ఖాతాలోని రూ.23 వేలు మాయం

జమ్మికుంట:  పట్టణానికి  చెందిన హోటల్‌ యజమాని మొగిలి సైబర్‌ ఉచ్చులో చిక్కుకున్నాడు. అపరిచితుడి మాటలు నమ్మి  రూ.23వేలు పోగొట్టుకున్నాడు. మున్సిపల్‌ పరిధిలోని రామన్నపల్లికి చెందిన మొగిళి పట్టణంలోని హరిహర థియేటర్‌ ఎదురుగా చందన హోటల్‌ నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్‌ ఫలితంగా ఇంటికే పరిమితమయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం  అపరిచితుడి నుంచి ఫో న్‌ వచ్చింది.  తనకు 50 పేట్ల టిఫిన్స్‌ సైప్లె చేయాలని, డబ్బులను ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తానని నమ్మబలికాడు. బ్యాంకు నంబర్‌, వివరాలు తీసుకున్నాడు. మళ్లీ కొద్దిసేపటి త ర్వాత ఫోన్‌ చేశాడు. డ బ్బులు బదిలీ చేశానని, ఏటీఎం, ఓటీపీ నంబర్‌ చెప్పాలని కోరాడు. దీంతో నమ్మిన మొగిళి నం బర్లు చెప్పాడు. ఆ వెంటవెంటనే రూ.18, 885, రూ. 4,999లు డ్రా  అయినట్లు మెస్సేజ్‌ వచ్చిం ది. డబ్బులు డ్రా అవుతుండడంతో పోలీస్‌ స్టేషన్‌కు వ చ్చాడు. వారు మొగిళి అకౌంట్‌లో ఉన్న మరో రూ.42వేలను వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. బ్యాంకు అధికారులకు చెప్పి ఖాతాను ఫ్రీజ్‌ చేయించారు. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌ నేరగాడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అపరిచితుడికి ఓటీపీ నంబర్లు చెప్పి తప్పిదం చేశానంటూ బాధితుడు ఇంటిబాట పట్టాడు. logo