శనివారం 11 జూలై 2020
Rajanna-siricilla - Jun 06, 2020 , 00:51:04

ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలి

ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలి

సమగ్ర వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష

చొప్పదండి: వానకాలం పంటల సాగులో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆదేశించారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ఆవరణలో వానకాలం సాగుపై నియోజకవర్గంలోని వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర వ్యవసాయంతో అధికలాభాలు వస్తాయని, దీనిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే దొడ్డురకం ధాన్యం పండించవద్దని ప్రభుత్వం చెబుతున్నదని ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అసలు ప్రభుత్వం దొడ్డురకం ధాన్యం పండించవద్దని ఎక్కడా చెప్పలేదని, గతంలో కన్నా కేవలం ఆరుశాతం మాత్రమే సన్నరకం వడ్ల సాగు పెంచిందని రైతులు గమనించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, ఏడీఏ రామారావు, ఆరు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు, పార్టీ మండల అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు. 


logo