ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Jun 06, 2020 , 00:48:07

సారు మాటే.. సాగు బాట

సారు మాటే.. సాగు బాట

సీఎం కేసీఆర్‌ పిలుపుతో రైతుల్లో చైతన్యం

అదునుకు ముందే సాగుకు శ్రీకారం 

పత్తి, సన్నరకాలకు ప్రాధాన్యం 

నియంత్రిత సేద్యం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ వానకాలం నుంచి అమలు చేయబోతున్న బృహత్తర కార్యక్రమం ఇది. ఒకే రకం పంట వేసి మార్కెట్లో డిమాండ్‌ లేక నష్టపోయే రైతుకు ఆర్థిక భరోసా ఉండాలనే లక్ష్యంతో తీసుకొస్తున్న సరికొత్త సాగు విధానానికి రైతాంగం జైకొడుతున్నది. ‘కేసీఆర్‌ సారు మాటే.. మా సాగు బాట’ అంటూ సమాయత్తమవుతున్నది. ఇప్పటిదాకా మూస ధోరణిలో పంటలు వేసిన నష్టపోయామని, ఇప్పుడు సరికొత్తగా సాగి సిరులు పండిస్తామని ధీమాగా చెబుతున్నది. మండువేసవిలోనూ పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలను చూసి తొలకరికి ముందుగానే సాగుబాట పడుతున్నది. 

             - సిరిసిల్ల రూరల్‌/ ఓదెల logo