శుక్రవారం 03 జూలై 2020
Rajanna-siricilla - Jun 06, 2020 , 00:46:00

ప్రతి ఎకరాకూ నీరందించడమే లక్ష్యం

ప్రతి ఎకరాకూ నీరందించడమే లక్ష్యం

మండలంలో 25 చెరువులు నింపుతాం

కాలువల నిర్మాణానికి భూములు ఇవ్వడం అభినందనీయం

కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక

మైలారంలో భూసేకరణ పై రైతులకు అవగాహన సదస్సు

ఎమ్మెల్యే రసమయితో కలిసి హాజరు

గన్నేరువరం:  తెలంగాణలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నదని కలెక్టర్‌ శశాంక పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో డీ-14 ఉప కాలువ నుంచి దేవుని చెరువును అనుసంధానించే కాలువ కోసం సేకరించాల్సిన భూమిని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం జంగపల్లిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ట్యాంకర్‌తో నీళ్లు పట్టారు మాదాపూర్‌ గ్రామంలోని చెరువును పరిశీలించారు. గ్రామంలో కాలువల నిర్మాణానికి కావల్సిన భూములను సేకరించడానికి రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ ప్రభుత్వం కాళేశ్వర జలాలను అన్ని గ్రామాలకు అందించడానికి కృషి చేస్తున్నదని, దీనిలో భాగంగా మండలంలో 25 చెరువులను నింపనున్నట్లు తెలిపారు. ఇందుకు కాలువల నిర్మాణం కోసం రైతుల భూములను సేకరించనున్నట్లు చెప్పారు. గ్రామంలో 46 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు రైతులు ముందుకు రాగా, వారిని అభినందించారు. ఈ కాలువలు పూర్తయితే 2 వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ భూములు ఇచ్చిన రైతులకు పరిహారం త్వరగా అందేలా చూస్తామన్నారు. తొలిసారిగా మైలారం గ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌ శశాంకతోపాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు తోట కోటేశ్వర్‌ గ్రామస్తుల తరఫున శాలువాతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు గన్నేరువరంలో పారిశుధ్య పనులను కలెక్టర్‌ ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ గూడెల్లి తిరుపతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ అల్వాల కోటి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చింతలపెల్లి నర్సింహారెడ్డి, ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌, తహసీల్దారు కే రమేశ్‌, ఎంపీడీవో నర్సింహారెడ్డి, సర్పంచులు బేతెల్లి సమత, అటికం శారద, కుమ్మరి సంపత్‌, దుడ్డు రేణుక, పుల్లెల లక్ష్మి, ఎంపీటీసీలు గూడెల్లి ఆంజనేయులు, ఎలేటి స్వప్న, అటికం రాజేశం, ఆర్‌బీఎస్‌ మండల కో ఆర్డినేటర్‌ బోడ మాధవరెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ రఫీ, నాయకులు పుల్లెల లక్ష్మణ్‌, న్యాత సుధాకర్‌, బేతెల్లి రాజేందర్‌, అటికం శ్రీనివాస్‌, దుడ్డు మల్లేశం, పీఏసీఎస్‌ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.logo