గురువారం 16 జూలై 2020
Rajanna-siricilla - Jun 05, 2020 , 01:45:22

పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలి

పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలి

అలసత్వం వహిస్తే చర్యలు.. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

జడ్పీ అధ్యక్షురాలు అరుణతో కలిసి తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో పర్యటన

ఇల్లంతకుంట: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పేర్కొన్నారు. పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా గురువారం ఆయన జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణతో కలిసి రామోజీపేట, పెద్దలింగాపూర్‌, రహీంఖాన్‌పేట గ్రామాల్లో పర్యటించారు. రామోజీపేటలో మొక్కలు ఎండిపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిపోయిన మొక్కల స్థానం లో కొత్తవి నాటాలని సూచించారు. పెద్దలింగాపూర్‌లో రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు ఉండడం, వైకుంఠధా మం వద్ద శానిటేషన్‌ పనులు సరిగ్గా నిర్వహించకపోవడం తో అసంతృప్తి చెందారు. తర్వాత రహీంఖాన్‌పేటలో నర్సరీని పరిశీలించి మొక్కలను నాణ్యతగా పెంచాలని సూచించారు. ప్రజలందరూ పారిశుధ్య వారోత్సవాల్లో భాగస్వాములు కావాలని, ఇందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్వో ఖిమ్యానాయక్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీనాథ్‌గౌడ్‌, ఎంపీడీవో అమరేందర్‌ రాజు, ఏపీడీ కృష్ణ, సర్పంచులు మధునవ్వ, జితేందర్‌గౌడ్‌, పరశురాం, ఎంపీటీసీ స్వప్న తదితరులు ఉన్నారు.

 స్వచ్ఛతతోనే ఆరోగ్యం

సిరిసిల్ల రూరల్‌: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అం దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పేర్కొన్నారు. పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా గురువా రం ఆయన తంగళ్లపల్లి మండలం బాలమల్లుపల్లె, బస్వాపూర్‌ గ్రామాల్లో కలియదిరిగి పరిసరాలను పరిశీలించారు. బస్వాపూర్‌లో పారిశుధ్య పనులు, నర్సరీ పురోగతిని పర్యవేక్షించారు. పారిశుధ్య నిర్వహణ బాగాలేకపోవడం, రోడ్లపై చెత్తాచెదారం ఉండడం, మొక్కలు ఎండిపోవడంతో కార్యదర్శి జనార్దన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణ, పచ్చదనంపై ప్రణాళిక లేకపోవడంతో కార్యదర్శి, సర్పంచ్‌ను నిలదీశారు. బాలమల్లుపల్లెలో కంపోస్ట్‌ షెడ్డును పరిశీలించి, పనులు వేగవంతంగా నిర్వహించాలన్నారు. ఇందులో డీపీవో రవీందర్‌, ఎంపీపీ పడిగెల  మానస, ఎం పీడీవో మదన్‌మోహన్‌, తహసీల్దార్‌ సదానందం, సర్పంచులు నీరజ, లత, ఎంపీటీసీ కనకలక్ష్మి, పడిగెల రాజు, ఎల్ల య్య, తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.


logo