గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jun 05, 2020 , 01:40:13

వేములవాడను సుందర పట్టణంగా తీర్చిదిద్దుకుందాం

వేములవాడను సుందర పట్టణంగా తీర్చిదిద్దుకుందాం

పురపాలక సంఘం అధ్యక్షురాలు మాధవి

వేములవాడ: పరిసరాలను పరిశుభ్రం చేసుకొని వేములవాడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందామని పురపాలక సంఘం అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి అన్నారు.  గురువారం ఆమె 12వ వార్డులో పట్టణ ప్రగతి పనులను పరిశీలించి మాట్లాడారు. పట్టణ ప్రగతిలో  ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. తడి, పొడి చెత్తను వేరుచేసి పురపాలక సంఘం సిబ్బందికి అందజేయాలని సూచించారు. కాలనీల్లో ఎక్కడైనా నీటి నిల్వలు ఉన్నట్లయితే సమాచారం అందిస్తే వెంటనే శుభ్రపరుస్తామన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్‌ వ్యాధులను అరికట్టవచ్చన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు  ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆమె వెంట కమిషనర్‌ మట్ట శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ ఏఈ శ్రవణ్‌, సెస్‌ డైరెక్టర్‌ రామతీర్థపు రాజు, నాయకుడు హరీశ్‌ ఉన్నారు. logo