సోమవారం 06 జూలై 2020
Rajanna-siricilla - Jun 04, 2020 , 02:49:56

గిరిజనులకు జీవనాధారం కల్పిస్తాం

గిరిజనులకు జీవనాధారం కల్పిస్తాం

 రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

కోనరావుపేట: గిరిజనులకు జీవనాధారం కల్పిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని ఊరుతండా వాసులు నాగారంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. కొన్నేళ్లుగా అటవీ భూములను సాగుచేస్తూ జీవిస్తున్నామని, ఇటీవల వాటిని దున్నవద్దని అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో జీవనాధారం కోల్పోతున్నామని వాపోయారు. దీంతో వినోద్‌కుమార్‌ అటవీ భూముల్లో పండ్ల తోటలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట రాజన్న సిరిసిల్ల జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, సెస్‌ డైరెక్టర్‌ తిరుపతి, సర్పంచ్‌ ఇస్లావత్‌ రాములు నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, తదితరులున్నారు.logo