శుక్రవారం 10 జూలై 2020
Rajanna-siricilla - May 28, 2020 , 07:10:31

ఆర్టీసీ బస్సులో చోరీ

ఆర్టీసీ బస్సులో చోరీ

సిరిసిల్ల క్రైం: ఆర్టీసీ బస్సులో చోరీ జరిగిన ఘటన సిరిసిల్ల పాత బస్టాండ్‌లో బుధవారం చోటుచేసుక్నుది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన వుత్తం అరుణ, తన కూతురు సౌఖ్యతో కలిసి ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి బయలు దేరింది. కరీంనగర్‌కు నుంచి నాన్‌స్టాప్‌ బస్సులో సిరిసిల్ల పాత బస్టాండ్‌లో దిగింది. అరుణ హ్యాండ్‌బాగ్‌ను బస్సులోనే మర్చిపోయింది. బస్టాండ్‌ ఆవరణలో పండ్లు కొనుగోలు చేసి, డబ్బుల కోసం చూడగా హ్యాండ్‌బ్యాగ్‌ కనిపించలేదు. వెంటనే బస్సులో వెతుకగా కనిపించకపోవడంతో సిరిసిల్ల ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


logo