ఆదివారం 12 జూలై 2020
Rajanna-siricilla - May 27, 2020 , 02:52:13

నియంత్రిత సాగుతో ఎంతో మేలు

నియంత్రిత సాగుతో ఎంతో మేలు

 అధికారులు రైతులను చైతన్యపరచాలి

 రైతు అవగాహన  సదస్సుల్లో        ఎమ్మెల్యే సుంకె  రవిశంకర్‌

చొప్పదండి/ గంగాధర/రామడుగు: నియంత్రిత పం టల సాగుతోనే అన్నదాతకు మేలు జరుగుతుందని  ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఉద్ఘాటించారు. చొప్పదండి మండలం రుక్మాపూర్‌, రామడుగు మండ లం షానగర్‌లో మంగళవారం ఆయా క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సుల్లో పాల్గొన్నారు. గంగాధర మండల పరిషత్‌ కార్యాలయంలో రైతుబంధు సమితి సభ్యులు, అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయా చోట్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అన్నదాత అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్‌ రైతు బాంధవుడిగా నిలిచారన్నారు. పంటల మార్పిడిని నియో జకవర్గంలోని రైతులు అనుసరించడం అభినందనీయమన్నారు. ఇక్కడి రైతులను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశంసించారని గుర్తుచేశారు.  క్లస్టర్‌ కేంద్రాల్లో రూ.20 లక్షలతో గిడ్డంగి, కార్యాలయాలను నిర్మిస్తామన్నారు.  రైతులు డిమాండ్‌ను బట్టి పంటలను పండించడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు.  రైతులు ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దన్నారు. ఏడీఏ రా మారావు మాట్లాడుతూ 70శాతం దొడ్డు రకం , 30 శాతం సన్నరకం వరి సాగు చేయాలని,  యాసంగిలో  మక్కకు బదులుగా కంది, పెసర, పత్తి సాగు చేసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ  చైర్మన్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్‌, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, సింగి ల్‌ విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, వ్యవసాయాధికారి వంశీ, గంగాధరలో ఎంపీపీ శ్రీరాం మధుకర్‌, ఏఎంసీ చైర్మన్‌ సాగి మహిపాల్‌రావు, ఆర్‌బీఎస్‌ మండలాధ్యక్షుడు పుల్కం గంగన్న,   ఏవో రాజు,  రామడుగులో ఎంపీపీ కలిగేటి కవిత, జడ్పీటీసీ మా ర్కొండ లక్ష్మి, సర్పంచ్‌ సైండ్ల కవిత, డీఆర్‌డీవో వెం కటేశ్వరరావు,  కొక్కెరకుంట విండో చైర్మన్‌  మురళీకృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కోఆర్డినేటర్‌ కరుణాకర్‌, జడ్పీ కోఆప్షన్‌ శుక్రొద్దీన్‌,  ఆర్‌బీఎస్‌ జిల్లా సభ్యుడు  కరుణాకర్‌,   జితేందర్‌రెడ్డి, ఎం కిష్టారెడ్డి, కే రవీందర్‌ ఉన్నారు. 


logo