సోమవారం 23 నవంబర్ 2020
Rajanna-siricilla - May 27, 2020 , 02:42:57

మండువేసవిలోనూ మత్తడి

మండువేసవిలోనూ మత్తడి

 గోదావరి జలాల రాకతో అలుగు పారుతున్న పులికుంట చెరువు

ముస్తాబాద్‌: పదేళ్లుగా చుక్క నీరూ లేని ఆ చెరువు నేడు అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌ కృషితో మండువేసవిలోనూ మత్తడి దూకుతున్నది. రంగనాయక సాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి సిద్దిపేట మండల శివారులోని మాచాపూర్‌ కాలువ ద్వారా వస్తున్న గోదావరి జలాలతో వెంకట్రావుపల్లిలోని పులికుంట చెరువు నిండి అలుగు పారుతున్నది. దీంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతున్నది. మండుటెండల్లో ఇలా గలగల పారే నీటి ప్రవాహాన్ని చూస్తాననుకోలేదని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కలకొండ కిషన్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన వెంట బందనకల్‌ మాజీ సర్పంచ్‌ జెల్ల వెంకటస్వామి, చిగురు మధు, శ్రీనివాస్‌రెడ్డి, రైతులు ఉన్నారు.