గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - May 25, 2020 , 01:46:46

నేడు ఈద్‌-ఉల్‌-ఫితర్‌

నేడు ఈద్‌-ఉల్‌-ఫితర్‌

 నేడు రంజాన్‌

ఇంటి వద్దే ప్రార్థనలు చేసుకోవాలని మతపెద్దల పిలుపు

ఈద్‌-ఉల్‌-ఫితర్‌ వేడుకలను నేడు జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. అయితే, కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ సారి ఎవరి ఇండ్లలో వారు ప్రార్థనలు చేయనున్నారు. 

- కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌/పెద్దపల్లి , సిరిసిల్ల కల్చరల్‌

పండుగ విశిష్టత..

రంజాన్‌ పండుగను ధనిక, పేద అని తేడా లేకుండా ముస్లింలందరూ జరుపుకోవాలని ఇస్లాం సూచిస్తుంది. అందుకే ఉన్నవారు లేనివారికి ఫిత్రా(దానధర్మాలు)ల రూపంలో చెల్లిస్తారు. ఈద్‌ నమాజ్‌కు వెళ్లేముందు ఈ ఫిత్రాలను చెల్లించాలి. అప్పుడే ఈద్‌ నమాజ్‌ దైవామోదం పొందుతుంది. అందుకే ఈ పండుగను ఈద్‌ ఉల్‌ ఫితర్‌ అని అంటారు. 

మసీదుల్లో ఐదుగురికి అనుమతి..

కరోనా నేపథ్యంలో పండుగ రోజు మసీదుల్లో ఇమామ్‌తో పాటు మరో నలుగురికి నమాజ్‌ చేసేందుకు అనుమతిని కల్పించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం మతాలకతీతంగా సామూహికంగా ఇచ్చే ఇఫ్తార్‌ విందులు లేవు. 

కరోనా కాలంలో జకాత్‌ చెల్లింపులు..

రంజాన్‌ మాసం ఈసారి సంక్షోభ సమయంలో రావడంతో ముస్లింలు పేద, బీదవారికి దాన ధర్మాలు చేశారు. రంజాన్‌ మాసంలో ఖురాన్‌లోని ఐదు సూత్రాలు పాటించాలని, మత పెద్దలు చెప్తారు. అందులో మొదటిది కల్మా, రెండోది నమాజ్‌, మూడోది జకాత్‌, నాలుగోది రోజా, ఐదోది హజ్‌యాత్ర. వీటన్నింటిలో జకాత్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉంది. తమ సంపాదనలో కనీసం 2.5 శాతం వరకు పేద ప్రజలకు పంచి పెట్టాలని పవిత్ర ఖురాన్‌ ప్రబోధం. 


logo