మంగళవారం 26 మే 2020
Rajanna-siricilla - May 23, 2020 , 03:00:06

సేవాభావంతో వైద్యం చేయాలి

సేవాభావంతో వైద్యం చేయాలి

గర్భిణుల పూర్తి వివరాలు ఉండాలి

సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

ఎంసీహెచ్‌ స్టేట్‌ ప్రోగ్రాం అధికారి సూర్యశ్రీ 

సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సందర్శన

సిరిసిల్ల టౌన్‌: మంత్రి కేటీఆర్‌ చొరవతో జిల్లా దవాఖానలో ఆధునిక వసతులతో కూడిన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, రోగులకు సేవాభావంతో వైద్యం అందించాలని ఎంసీహెచ్‌ స్టేట్‌ ప్రోగ్రాం అధికారి సూర్యశ్రీ వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఇక్కడ అందిస్తున్న వైద్య సేవలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, దవాఖాన సూపరింటెండెంట్‌ మురళీధర్‌రావును అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దవాఖానకు వచ్చే గర్భిణుల పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. మొదటి నెల పరీక్షల నుంచి ప్రసవం తరువాత ఇంటికి చేర్చే వరకు రికార్డు ఉండాలన్నారు. 102 వాహన సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాల సంఖ్య మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో గర్భిణులను కరీంనగర్‌కు రిఫర్‌ చేసిన సమయంలో ప్రసవం పూర్తయ్యే వరకు సంబంధిత వైద్యులతో మానిటరింగ్‌ చేయాలన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెరగడం, కేసీఆర్‌ కిట్స్‌ పంపిణీ, ఎన్‌బీసీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసి వైద్యులను అభినందించారు. 


logo