శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - May 21, 2020 , 01:10:24

ఊరిస్తున్న ఊడుగు పండ్లు..

ఊరిస్తున్న ఊడుగు పండ్లు..

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

వేసవిలో మాత్రమే దొరికే ఊడుగు పండ్లు.. పల్లె ప్రజలను ఊరిస్తున్నాయి. ఈ పండ్లలోని తియ్యని నీళ్లు, తెల్లని గుజ్జు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేడ్లు, మినరల్స్‌, కాల్షియం, పాస్పరస్‌, విటమిన్‌ సీ, విటమిన్‌ బీ పుష్కలంగా లభిస్తాయి. దీంతో ఇవి గ్రామీణ ప్రాంతాల వారికి ఆరోగ్య ప్రదాయినిగా మారాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి వద్ద విరగ గాసిన ఊడుగు చెట్టు, కొమ్మకొమ్మకూ పండిన నల్లటి పండ్లు అటుగా వెళ్లేవారిని ఆకర్శిస్తున్నాయి. 

- పెద్దపల్లి, నమస్తే తెలంగాణ 


logo