గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - May 21, 2020 , 01:10:25

అగ్నికి ఆహుతి

అగ్నికి ఆహుతి

  • వేర్వేరుచోట్ల అగ్నిప్రమాదాలు
  • భారీగా ఆస్తినష్టం..
  • హుజూరాబాద్‌ శివారులో టిప్పర్‌,  కాంక్రీట్‌ మిక్చర్‌, శంకరపట్నంలో ఎయిర్‌టెల్‌ టవర్‌ దగ్ధం
  • తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లిలో దూడల మృత్యువాత

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన అగ్ని ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది..పలుచోట్ల మంటలు చెలరేగి పశుగ్రా సం కాలిబూడిదైంది. 

హుజూరాబాద్‌టౌన్‌: పట్టణంలోని నాగేంద్రబార్‌ ప క్కన ఉన్న పొలంలో రైతు  కొయ్యకాళ్లు తగుల బెట్టాడు. మంటలు వ్యాపించి  సమీపంలో ఉన్న   టిప్పర్‌(లారీ), కాంక్రీట్‌ మిక్చర్‌ మిషన్‌,  టైర్లు కాలిబూడిదయ్యాయి. సమాచారమందుకున్న  ఏసీపీ సందరగిరి శ్రీనివాస్‌రావు, టౌన్‌ సీఐ మా ధవి అక్కడికి చేరుకున్నారు.  ఫైర్‌స్టేషన్‌కు తెలియ జేయగా అగ్నిమాపక సిబ్బందివచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో రూ. 20లక్షల ఆస్తినష్టం జరిగిందని ఏడీఎఫ్‌వో డీ ప్రభాకర్‌రావు తెలిపారు.  

శంకరపట్నం:  మండలకేంద్రంలో తెలంగాణ గ్రా మీణ బ్యాంకుకు ఎదురుగా ఉన్న కాలనీలో  ఎయి ర్‌టెల్‌ సెల్‌ టవర్‌ కాలిపోయింది. సమీపంలోని కోతలు పూర్తయిన పంటపొలాల్లో ప్రమాదవ శాత్తు నిప్పంటుకొని మంటలు జనావాసాల్లోకి వ్యాపించాయి.  అక్కడే ఉన్న ఎయిర్‌టెల్‌ ట వ ర్‌కు అంటుకోగా బ్యాటరీ, జనరేటర్‌, పవర్‌ ప్లాం ట్‌, ఫిల్టర్లు, పవర్‌ సిస్టం మంటల్లో కాలిపోయా యి. కాగా స్థానికులు బిందెల్లో నీళ్లను తెచ్చి పో యడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.  ఈ లోగా హుజూరాబాద్‌, మానకొండూర్‌ మండలా లకు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పివేశారు.  ఈ ప్రమాదంలో   దాదాపు రూ. 30 లక్షల నష్టం జరిగినట్లు కంపెనీ ప్రతినిధి ప్రసాదరెడ్డి వెల్లడించారు. జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ కిరణ్‌, ఎస్‌ఐ రవి ఘటనాస్థలానికి  చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  

 వీర్నపల్లి: షార్ట్‌సర్క్యూట్‌తో ఓ హోటల్‌ దగ్ధమైం ది. ఈ ఘటన వీర్నపల్లి మండలం బాబాయ్‌చెరువు తండాలో బుధవారం జరిగింది. తండాకు చెందిన లకావత్‌ రాజు తన  పూరిగుడిసెలోనే  హోటల్‌ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. కుటుంబసభ్యులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమంకాగా షార్ట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి  సమాచారం అందించగా అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ అగ్నిప్రమాదంలో  హోటల్‌మర మ్మ తుల కోసం అప్పుతెచ్చిన రూ.2 లక్షలు  కాలిపో గా రెండు తు లాల బంగారు గొలుసు, 20 తులా ల వెండి ఆభరణాలు  మసిబారి పోయాయని బాధితులు తెలిపారు. కాగా జడ్పీటీసీ గుగులోత్‌ కళావతి దగ్ధమైన హోటల్‌ను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని విజ్ఞప్తిచే శారు.  కానిస్టేబుల్‌  శంకర్‌, హోం గార్డు గోపాల్‌ బాధిత కుటుంబానికి రూ.1500 ఆర్థిక సాయం అందించారు. 

సిరిసిల్ల రూరల్‌: తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో బుధవారం షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమా దం జరిగింది. గ్రామానికి చెందిన ఎగుర్ల శ్రీనివాస్‌కు చెందిన గడ్డివాము, కరెంట్‌ మోటర్‌ కాలిపో గా, దొడ్డిలో కట్టేసిన రెండు దూడలు మృత్యువాతపడ్డాయి. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో గ్రామస్తులు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.60వేల వరకు నష్టం వాటిల్లిందని  బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఎల్లారెడ్డిపేట: మండలంలోని గొల్లపల్లిలో ప్రమాదవశాత్తు పశుగ్రాసం దగ్ధమైంది.  గ్రామానికి చెందిన మర్రి దేవారెడ్డి  నాలుగు ట్రిప్పుల గడ్డిని పోగుచేసి తన పొలం వద్ద కుప్పలుగా పెట్టాడు. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో గడ్డితోపాటు అక్కడే ఉన్న బోరు, లిఫ్ట్‌ పైపులు కాలిబూడిదయ్యాయి. కాగా కొందరు కక్షతోనే గడ్డిని, పైపులను తగులబెట్టారని బాధితుడు దేవారెడ్డి ఆరోపించారు.  

వీర్నపల్లి:  వీర్నపల్లి మండలం సీతారాంనాయక్‌ తండా పరిధిలో అజ్మీరాతండాలో అజ్మీరా రాజు, వసంత్‌కు చెందిన ఎనిమిది ట్రాక్టర్‌ ట్రి ప్పుల గడ్డి షార్ట్‌సర్క్యూట్‌తో  దగ్ధమైంది. కాగా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితులు కోరారు.

వేములవాడరూరల్‌: వేములవాడ రూరల్‌ మం డలం మర్రిపెల్లికి చెందిన రాచర్ల భూమయ్య, రాచర్ల లచ్చయ్యకు చెందిన గడ్డి, అలాగే చెక్కపల్లి  కి చెందిన లింగంపల్లి హనుమంతు, అడ్డిక లచ్చిరెడ్డికి చెందిన గడ్డి ప్రమాదవశాత్తు దగ్ధమైంది.    ఈ ఘటనలో ఒక్కో రైతుకు రూ. 25 వేల వరకు నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. 


logo