శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - May 20, 2020 , 02:38:54

డిమాండ్‌ ఉన్న పంటలే వేయాలి

డిమాండ్‌ ఉన్న పంటలే వేయాలి

పెగడపల్లి : ప్రభుత్వ సూచనల మేరకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. పెగడపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ఈశ్వర్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. రైతులతా ఒకే రకమైన పంట వేసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రహించిన ముఖ్యమంత్రి, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని వివరించారు. ఆయకట్టు చివరి భూములకూ సక్రమంగా నీరందించేందుకు నియోజకవర్గంలో ని ఎస్సారెస్పీ కాలువల్లో పూడిక తీస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెగడపల్లి మండ లం నర్సింహునిపేట సమీపంలోని డీ-83/ఏ కా లువ పూడికతీత పనులను మంత్రి ప్రారంభించా రు. పెగడపల్లిలోని డీ-76, డీ-77 కాలువ పనులను పరిశీలించారు. ఇన్నేళ్లుగా ఆయకట్టు చివర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మపురి, వెల్గటూ ర్‌, బుగ్గారం, ధర్మారం మండలాల్లో పైలట్‌ ప్రాజె క్టు కింద ఎస్సారెస్పీ కాలువలకు ఉపాధి హామీ ప థకంలో పూడిక మట్టితోపాటు, ముళ్ల పొదల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీని వల్ల సుమారు 500 కిలోమీటర్ల మేర కాలువల మరమ్మతు పనులు 20 రోజుల పాటు జరుగుతాయని, కూలీలకు చేతి నిండా పని ఉంటుందని తె లిపారు. అనంతరం పెగడపల్లిలో రూ.25 లక్షల తో నిర్మించే గ్రంథాలయ భవనం, సుద్దపల్లి జడ్పీ పాఠశాలలో రూ.35 లక్షలతో నిర్మించే అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను మంత్రి ఈశ్వర్‌ ప్రారంభించారు. పెగడపల్లి జడ్పీ పాఠశాలలో ఆశ్రమ్‌-ఆకృతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండలంలోని 90 మంది దివ్యాంగులకు మంత్రి ఈశ్వర్‌ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోళి శోభ, జడ్పీటీసీ కాసుగం టి రాజేందర్‌రావు, సింగిల్‌ విండో చైర్మన్లు వోరుగంటి రమణారావు, కర్ర భాస్కర్‌రెడ్డి, మంత్రి వే ణుగోపాల్‌, వైస్‌ ఎంపీపీ గాజుల గంగాధర్‌, సర్పంచులు మేర్గు శ్రీనివాస్‌, నేరువట్ల బాబుస్వా మి, నేరెళ్ల హారిక, కోరుకంటి రాజేశ్వర్‌రావు, ఉప్పలంచ లక్ష్మణ్‌, జిట్టబోయిన కొండయ్య, ఎంపీటీసీలు బొమ్మెన జమున, సింగసాని విజయలక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి నరేశ్‌, తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశం, డీఈ రహమా న్‌, సీఐ కిశోర్‌, ఎస్‌ఐ నవత, ఎంపీవో మున్వర్‌బేగ్‌, ఏపీవో వేణు, ఐసీడీఎస్‌ సీడీపీవో నర్సింగరాణి, ఆర్బీఎస్‌ మండలాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ రహీం పాల్గొన్నారు. logo