ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - May 15, 2020 , 01:56:46

ప్రభుత్వ భూముల సర్వే పూర్తిచేయాలి

ప్రభుత్వ భూముల సర్వే పూర్తిచేయాలి

  • కలెక్టర్‌ శశాంక

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని ఇరిగేషన్‌, ఎస్సారెస్పీ కాలువల కింద భూములను గుర్తించి, ఆ భూ ముల సర్వే పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. కలెక్టర్‌ సమావేశ మందిరంలో రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించా రు. కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లకముందే రెవెన్యూ, ఇరిగేషన్‌, ఎస్సారెస్పీ అధికారులు సమన్వయంతో భూ సేకరణ చేసి, హద్దులు వేయాలన్నారు. ఇప్పటికే ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమించి ఉంటే వాటిని ఖాతాలవారీగా గుర్తించి, స్వాధీనపరుచుకోవాలని ఆదేశించారు. సేకరించిన భూములు.. వ్యవసాయ భూములకు తేడాలు లేకుండా చూడాలని, ఎన్‌పీఎం డేటాకంటే భూసేకరణలో ఎక్కువ ఉంటే అలాంటి తేడాలు రాకుండా సరి చూసుకోవాలన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఇద్దరు ఆర్డీవోలు డివిజన్‌వారీగా అవసరమైన భూములు గుర్తించి, సిద్ధం చేయాలన్నారు. వచ్చేవారం చివరి నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, అధికారులు పాల్గొన్నారు.  

సమగ్ర వ్యవసాయ ప్రణాళికపై సమీక్ష

కలెక్టర్‌ శశాంక ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, నీటిపారుదల, ఇరిగేషన్‌ అధికారులతో సమగ్ర వ్యవసాయ ప్రణాళికపై కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాది నీటి విడుదల ప్రస్తుతం సాగునీటి లభ్యత, వర్షపాతం వివరాలు, పంటల సరళిని సమీక్షించారు.