బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - May 14, 2020 , 02:15:58

తరగని సేవానిరతి

తరగని సేవానిరతి

  • ఔదార్యం చాటుకుంటున్న దాతలు
  • వలసకార్మికులు, అభాగ్యులకు చేయూత
  • కొనసాగుతున్న అన్నదానాలు

కార్పొరేషన్‌/కరీంనగర్‌ రూరల్‌ /గంగాధర/చొప్పదండి/హుజూరాబాద్‌ టౌన్‌/ జమ్మికుంట/వీణవంక/ చిగురుమామిడి: కరీంనగరంలోని 15వ డివిజన్‌లో దాతలు గుంటి వెంకటేశ్వర్లు-అరుణశ్రీ తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సమకూర్చిన నిత్యావసరాలను మేయర్‌ సునీల్‌రావు, కార్పొరేటర్‌ నాగసముద్రం జయలక్ష్మి చేతులమీదుగా పేదలకు పంపిణీ చేశారు. కరీంనగర్‌ మండలం నాగులమల్యాలలో అమ్మ స్వచ్ఛం ద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గంగాధర మండలం నారాయణపూర్‌లో సర్పంచ్‌ ఎండీ నజీర్‌ 50 కిలోలు, గంగాధర ఏఎంసీ డైరెక్టర్‌ గర్వందుల పర్శరాములు 60 కిలోల బియ్యాన్ని రైస్‌ డొనేషన్‌ డ్రమ్ముల్లో పోశారు. చొప్పదండి మండలం ఆర్నకొండలో రేషన్‌ డీలర్‌ మచ్చ రమేశ్‌ గ్రామంలోని రేషన్‌కార్డులేని నిరుపేదలకు 5కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. హుజూరాబాద్‌ పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లోని రేషన్‌ దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన రైస్‌ డొనేషన్‌ బాక్స్‌ల ద్వారా వచ్చిన బియ్యాన్ని 910 మంది నిరుపేద వలస కూలీలకు పంపిణీ చేశారు. పట్టణంలో పలు చోట్ల జరిగిన ఈ కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే, రైస్‌మిల్‌ వ్యాపా రి పేరాల సదానందం హుజూరాబాద్‌ మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది 200 మందికి అన్నదానం చేశారు. జమ్మికుంట పట్టణంలోని చిరు వ్యాపారులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఒక్కొక్కరికి 20 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు సమకూర్చగా, వాటిని మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ శారద-మల్లయ్య, టీఆర్‌ఎస్‌ అర్బన్‌శాఖ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, కోటి పంపిణీ చేశారు. ‘మానవత బై ఫ్రెండ్స్‌' మధు ఆధ్వర్యంలో వలస కార్మికులు, పేదలకు మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. వీణవంక మండలం ఇ ప్పలపల్లిలో నిరుపేదలకు యప్‌ టీవీ సీఈవో ఉదయ్‌నందన్‌రెడ్డి రూ.40 వేల నిత్యావసర సరుకులు సమకూర్చగా, సర్పంచ్‌ విజయ, శ్రీనివాస్‌, మల్లయ్య, రమేశ్‌, చిగురుమామిడి మండలం పెద్దమ్మపల్లిలో పేదలకు న్యా యవాది సురేశ్‌ నిత్యావసర వస్తువులు సమకూర్చగా, సర్పంచ్‌ రజిత, ఎంపీటీసీ సంధ్య, సింగిల్‌విండో డైరెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ మహిపాల్‌రెడ్డి అందజేశారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

సిరిసిల్లటౌన్‌/ఎల్లారెడ్డిపేట/బోయినపల్లి /సిరిసిల్ల రూరల్‌:  సీఎం కేసీఆర్‌ పిలుపుతో టీటీడీ డైరెక్టర్‌, సిద్ద రామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో వెయ్యి మందికి పైగా అంబలి పంపిణీ చేయగా, ఈ కార్యక్రమాన్ని మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, కౌన్సిలర్‌ నీరజ, అర్బన్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ లక్ష్మీనారాయణ, పూర్ణచందర్‌, మ్యాన రవి, తదితరులున్నారు. ఎల్లారెడ్డిపేటతోపాటు బొప్పాపూర్‌, గొల్లపల్లిలో 101 మంది పేదలకు సత్యసాయి సేవాసమితి సభ్యులు భోజన ప్యాకెట్లను అందించారు. ఒడిశాకు చెందిన వలస కూలీలు స్వగ్రామాలకు నడిచి వెళ్తుండగా, వెంకటాపూర్‌లో 86 మంది కి దుర్గం విజయ్‌ అన్నదానం చేశారు. బోయినపల్లి మండలం వరదవెల్లిలో పారిశుధ్య కార్మికులు, అంగన్‌వాడీ ఆయాలు, వన సంరక్షకులు మొత్తం 22 మందికి సర్పంచ్‌ రాజుతో కలిసి హరితమిత్ర అవార్డు గ్రహీత, వరదవెల్లి ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవీందర్‌ నిత్యావసరాలు పంపిణీ చేశారు. తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్‌, వేణుగోపాలపూర్‌లో 300 మంది ఉపాధి కూలీలతోపాటు రైతులు, హమాలీలకు సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వేణుగోపాలరావు, అంకారపు రవీందర్‌, వైస్‌ ఎంపీపీ అంజయ్య మాస్కులను అందజేశారు. సర్పంచులు నందగిరి నర్సయ్య, కాయితి బాలయ్య ఉపాధిహామీ కూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు. జడ్పీటీసీ పుర్మాణి మంజుల రాంలింగారెడ్డి దంపతులు కూలీలకు రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇక్కడ టీఆర్‌ఎ స్‌ మండలాధ్యక్షుడు రాజన్న, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవదాస్‌, వైస్‌ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, సంతోష్‌గౌడ్‌ ఉన్నారు. చంద్రంపేటలో గాలివానతో ఇండ్లు కూలిపోయిన మూడు బాధిత కుటుంబాలకు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం 15రోజులకు సరిపడా నిత్యావసరాలతోపాటు రూ.2 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఇక్కడ కౌన్సిలర్‌ రాజిరెడ్డి, మున్సిపల్‌ విప్‌ దినేశ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత దిడ్డిరాజు, అబ్బగోని శ్రీనివాస్‌గౌడ్‌ ఉన్నారు.


logo