శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - May 14, 2020 , 01:25:43

రుద్రంగి సస్యశ్యామలం

రుద్రంగి సస్యశ్యామలం

  • రాజన్న సిరిసిల్ల జడ్పీ అధ్యక్షురాలు అరుణ

రుద్రంగి: గోదావరి జలాలతో మెట్ట ప్రాంతమైన రుద్రంగి మండలం సస్యశ్యామలం కానున్నదని రాజన్న సిరిసిల్ల జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. రుద్రంగి గండి వేంకటేశ్వర ఆలయం నుంచి కాలువ ద్వారా గోదావరి జలాలను నాగారం చెరువులోకి బుధవారం ఆమె విడుదల చేశారు. గోదావరి జలాలకు టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ప్రత్యేక కృషితోనే నియోజకవర్గానికి గోదావరి జలాలు అందుతున్నాయని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఏడాదికి మూడు పంటలు పండే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం రుద్రంగి గ్రామ టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, జగిత్యాల జడ్పీ వైస్‌చైర్మన్‌ హరిచరణ్‌, ఎంపీపీలు గంగం స్వరూపారాణి, బైరగోని లావణ్య, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్‌, జవ్వాజీ రేవతి, జడ్పీటీసీలు మీనయ్య, నాగం భూమయ్యతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 


logo