సోమవారం 13 జూలై 2020
Rajanna-siricilla - May 14, 2020 , 01:25:45

సందడి లేని పెళ్లిళ్లు

సందడి లేని పెళ్లిళ్లు

  • లాక్‌డౌన్‌తో నిరాడంబరంగా వివాహాలు 
  • కొద్ది మంది సమక్షంలోనే కల్యాణ తంతు 
  • మాస్కులతో వధూవరులు, బంధువులు

మంథనిటౌన్‌/సిరిసిల్ల: వందలాది మంది బంధుమిత్రుల నడుమ అట్టహాసంగా జరుగాల్సిన వివాహాలు, కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా సాగుతున్నాయి. కేవలం కొద్ది మంది సమక్షంలోనే జంటలు ఏకమవుతున్నాయి. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని భగత్‌నగర్‌లో భాగ్యశ్రీ, సాయికుమార్‌.. మంథని రావులచెరువుకట్టలో దూలం తేజస్వి, వెంకటప్ప శ్రీకాంత్‌.. తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లిలో సౌజన్య, ప్రవీణ్‌కుమార్‌.. కొద్ది మంది కుటుంబసభ్యుల నడుమ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆయాచోట్ల పురోహితులు మాస్కు ధరించి పెళ్లి తంతును పూర్తి చేశారు. వధూవరులే కాదు, వారి కుటుంబసభ్యులు కూడా మాస్కులు ధరించారు. భౌతికదూరం పాటిస్తూ, శానిటైజర్‌తో హ్యాండ్‌ వాష్‌ చేసుకున్నారు. 


logo