ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - May 11, 2020 , 02:51:59

విధుల్లో చేరిన ఆర్టీసీ ఉద్యోగులు

విధుల్లో చేరిన ఆర్టీసీ ఉద్యోగులు

కలెక్టరేట్‌/వేములవాడ రూరల్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో 49 రోజులుగా ఇండ్లల్లోనే ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, గ్యారేజీ కార్మికులు, సూపర్‌వైజర్లు ఆర్టీసీ ఎండీ సుశీల్‌ శర్మ ఆదేశాల మేరకు ఆదివారం విధుల్లో చేరారు. సిరిసిల్ల డిపోలో మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించారు. సోమవారం నుంచి రెండు షిఫ్టు లు ఉదయం 6.00 నుంచి మధ్యా హ్నం 2.00 గంటల వరకు, ఉదయం 10.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు రెండు షిఫ్టులు ఉంటాయని డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మొత్తం 105 మంది విధుల్లో చేరినట్లు ఆయన తెలిపారు. పలు విభాగాలతోపాటు బస్టాండ్లలో సిబ్బందికి విధులు కేటాయించామని తెలిపారు. వేములవాడలో 25మంది ఉద్యోగులు విధుల్లో చేరారు.


logo