గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - May 10, 2020 , 02:39:15

రాష్ర్టాభివృద్ధే టీఆర్‌ఎస్‌ ధ్యేయం

రాష్ర్టాభివృద్ధే టీఆర్‌ఎస్‌ ధ్యేయం

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారు
  • కాంగ్రెస్‌ను ప్రజలు మరిచిపోయారు
  • నగర మేయర్‌ వై సునీల్‌రావు

కార్పొరేషన్‌ : రాష్ర్టాభివృద్ధే టీఆర్‌ఎస్‌ సర్కారు ధ్యే యమని మేయర్‌ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. నగరంలోని తన చాంబర్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోయి గడ్డాలు పెంచుకున్న, సొంత నియోజకవర్గంలోనే ఉప ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు ఇప్పుడు తమ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కరోనా కట్టడి కోసం టీఆర్‌ఎస్‌ సర్కారు, సీఎం కేసీఆర్‌ అహర్నిష లూ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 6,250 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి గ్రా మాల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వీటిని పట్టించుకోకుండా ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సాగుతుందన్నారు. ఈ విపత్కర స్థితిలోనూ ఇప్పటికే 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగలిగామని చెప్పారు. రైతులు ధాన్యం అమ్ముకున్న తర్వాత కేవలం మూడు రోజుల్లోనే డబ్బులు కూడా వారి ఖాతాల్లో జమచేస్తున్నట్లు తెలిపారు. రైతాంగం పూర్తిగా టీఆర్‌ఎస్‌కు అండగా నిలిస్తే తమ ఉనికి లేకుండా పోతుందన్న అక్కసుతోనే ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలకు దిగుతున్నాయని దుయ్యబట్టారు. ఎల్‌ఎండీ నుంచి కిందకు 79 టీఎంసీల నీటిని విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌ అధికారంలో ఉన్నప్పుడు తన జిల్లాకు నీరు ఇప్పించుకోలేకపోయారని, కానీ టీఆర్‌ఎస్‌ హయాంలోనే ఎల్‌ఎండీ టేలెండ్‌ వరకు సాగునీరు అందించామని చెప్పారు. ఇప్పటివరకు 40 లక్ష ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. అందు లో 30 లక్షల మెట్రిక్‌ టన్నులు కేవలం తెలంగాణ నుంచే కొనుగోలు చేసినట్లు ఎఫ్‌సీఐ(ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) చైర్మన్‌ చెప్పారని గుర్తు చేశారు. ఓడిపోయిన కాంగ్రెస్‌ నాయకులందరూ కలిసి టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కరెంటు, సాగునీరు, బీమా, రైతుబంధు పథకాల గు రించి ఎందుకు ఆలోచన చేయలేకపోయిందని ప్ర శ్నించారు. మధ్య మానేరును పూర్తి చేసి, నీరిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ధాన్యం ఎవరు కొం టారో కూడా తెలియకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నా యకులు తమ భాష మార్చుకోవాలని హితవు పలికారు. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, గంట కల్యాణి, వాల రమణారావు, నాయకులు చల్ల హరిశంకర్‌, గంట శ్రీనివాస్‌ పాల్గొన్నారు.logo