ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - May 10, 2020 , 02:39:15

భూ వివాదంలో కొత్త జైపాల్‌రెడ్డిపై కేసు

భూ వివాదంలో కొత్త జైపాల్‌రెడ్డిపై కేసు

గంగాధర : మండలంలోని లక్ష్మీదేవిపల్లి దీపాలకుంట వద్ద గంగాధర రా మడుగు మండలా ల సరిహద్దుల వద్ద భూ వివాదంలో సింగిల్‌ విండో మా జీ అధ్యక్షుడు కొత్త జైపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తాండ్ర వివేక్‌ తెలిపారు. శుక్రవారం సర్వే నిర్వహిస్తుండగా విధులకు ఆటంకం కలిగించాడని రామడుగు తహసీల్దార్‌ కోమల్‌రెడ్డి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు జైపాల్‌రెడ్డిని అరెస్టు చేశామని, అనంతరం బెయిల్‌పై విడుదల చేసినట్లు పేర్కొన్నారు. గంగాధర పోలీస్‌స్టేషన్‌ వద్ద రైతులు, జైపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులకు గంగాధర, రామడుగు మండలాల మధ్య గల భూమికి సంబంధించి కొంతకాలంగా వివాదం జరుగుతోంది. శుక్రవారం రామడుగు తహసీల్దార్‌ కోమల్‌రెడ్డి, గంగాధర తహసీల్దార్‌ జయంత్‌ ఘటనా స్థలానికి వచ్చి రెవెన్యూ సిబ్బందికి సూచనలు చేసి వెళ్లారు. తహసీల్దార్ల సూచనల మేరకు రెవెన్యూ సిబ్బంది సర్వే చేశారు. తమకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా అధికారులు సర్వే చేస్తున్నారని రైతులు లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు కొత్త జైపాల్‌రెడ్డికి తెలుపుగా వారితో కలిసి సర్వే చేస్తున్న ప్రదేశానికి వచ్చారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండానే సర్వే ఎలా చేస్తారని తహసీల్దార్‌ కోమల్‌రెడ్డిని ఫోన్‌లో నిలదీశారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించినట్లు తహసీల్దార్‌ కోమల్‌రెడ్డి శుక్రవారం గంగాధర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం జైపాల్‌రెడ్డిని అరెస్టు చేసి గంగాధర పోలీస్‌ స్టేషన్‌కు తకలించారు. విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు గంగాధర పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. కాగా, టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి గంగాధర పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని జైపాల్‌ రెడ్డికి మద్దతు తెలిపారు.logo