గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - May 10, 2020 , 02:39:16

ఆపత్కాలంలో అండగా..

ఆపత్కాలంలో అండగా..

  • నిరుపేదలకు దాతల బాసట
  • అభాగ్యులకు అన్నదానాలు

కరీంనగర్‌ నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: నగరంలోని పలువురు పూజారులకు మార్కెట్‌ రోడ్డులోని వేంకటేశ్వర దేవాలయంలో చిందం శ్రీనివాస్‌-చిత్రలేఖ దంపతులు నిత్యావసర సరుకులను అందించారు. పూజా సామగ్రితోపాటు దక్షిణ తాంబూలాలు కూడా అందించారు. గోదరి కాంతలక్ష్మి సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం అనాథలు, వృద్ధులు, నిరుపేదలకు అల్పాహారం, పండ్లు అందజేసి, అన్నదానం చేశారు. అనిల్‌, జితేందర్‌, తదితరులున్నారు. విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌)లో కార్యదర్శి ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి అన్నదానం చేశారు. అలయన్స్‌క్లబ్‌ పూర్వ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ కొండూరి రంగారావు జన్మదిన వేడుకలను వాసుదేవ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. చొప్పదండి మండలం కొలిమికుంటలో ఆలయ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ఐఏఎస్‌ నరహరి ఆధ్వర్యంలో ఫౌండేషన్‌ సభ్యులు గ్రామ ప్రజలకు సర్పంచ్‌ తాళ్లపల్లి సుజాత చేతుల మీదుగా మాస్కులు పంపిణీ చేశారు. హుజూరాబాద్‌ పట్టణంలోని బుడగజంగాల కాలనీకి చెందిన తూర్పాటి రాజు ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబానికి  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు టేకుల శ్రావణ్‌ 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జమ్మికుంట పట్టణంలో బ్రాహ్మణులు, అర్చకులకు యప్‌ టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో పాడి ఉదయ్‌ నందన్‌రెడ్డి 20 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులు సమకూర్చగా, శివాలయం ఆవరణలో సీఐ సృజన్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

సిరిసిల్ల టౌన్‌/ ఇల్లంతకుంట/ ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట/ముస్తాబాద్‌: జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో చొప్పదండి ప్రణీత ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళతో కలిసి కొండూరి రవీందర్‌రావు ప్రారంభించారు. అనంతరం అన్నం వడ్డించారు. ఇల్లంతకుంటలో 15 మంది వలస కూలీలకు బాబు అనే కానిస్టేబుల్‌ నిత్యావసరాలు అందజేశారు. ఎల్లారెడ్డిపేటతో పాటు గొల్లపల్లి, బొప్పాపూర్‌కు చెందిన 81మంది పేదలకు బొప్పాపూర్‌ సత్యసాయి సేవాసమితి సభ్యులు భోజనం ప్యాకెట్లను అందించారు. గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 50 మంది పార్ట్‌ టైం స్వీపర్లకు డీటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాలు సమకూర్చగా, టెస్కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌రావు పంపిణీ చేశారు. ఎంపీపీ కరుణ, జడ్పీటీసీ విజయ, ఏఎంసీ చైర్మన్‌ దయాకర్‌రావు, సెస్‌ డైరెక్టర్‌ దేవేందర్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్‌ ఉన్నారు. కొత్తపల్లిలో వలస కూలీ కుటుంబానికి ఎస్‌ఐ నీలం రవి 50 కిలోల బియ్యం, నిత్యావసరాలను అందించారు. ఆవునూర్‌, తుర్కపల్లి, రామలక్ష్మణులపల్లెల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 400 మంది హమాలీలు, రైతులు, కేంద్రాల సిబ్బందికి సిద్దిపేటకు చెందిన టీటీడీ బోర్డు మెంబర్‌ ఎం రాములు పులిహోర, తైదంబలిని ఎంపీపీ శరత్‌రావు, జడ్పీటీసీ నర్సయ్య, సహకార సంఘం చైర్మన్‌ తన్నీరు బాపురావుతో కలిసి అందజేశారు.


logo