శుక్రవారం 10 జూలై 2020
Rajanna-siricilla - May 09, 2020 , 02:18:32

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

చొప్పదండి/ మానకొండూర్‌/ శంకరపట్నం/ గన్నేరువరం/ తిమ్మాపూర్‌ రూరల్‌/ సిరిసిల్ల రూరల్‌/ ఇల్లంతకుంట : రైతుబాంధవుడు సీఎం కేసీఆర్‌ అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి పే ర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, పంట రుణమాఫీ నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ చొప్పదండి మండలం సాంబయ్యపల్లె, దేశాయ్‌పేట, రేవెల్లి, మానకొండూర్‌ వ్యవసాయ మా ర్కెట్‌ కమిటీ ఆవరణ, తిమ్మాపూర్‌ మండలం మహాత్మానగర్‌, శంకరపట్నం, గన్నేరువరం మండలకేంద్రాల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి పాలాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా సాంబయ్యపల్లెలో ఏనుగు ర వీందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి రైతుపక్షపాతి అని నిరూపించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో విండో అధ్యక్షుడు వెల్మ మల్లారెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్‌, జడ్పీటీసీ లు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్‌, లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ వాల ప్రదీప్‌రావు, వైస్‌ చైర్మన్‌ పడాల సతీశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉల్లెంగుల ఏకానందం, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, బందారపు అజయ్‌కుమార్‌ గౌడ్‌, గంట మహిపాల్‌ పాల్గొన్నారు. రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ గడ్డం నర్స య్య   సిరిసిల్లలోని బల్యాలనగర్‌ కొనుగోలు కేంద్రం లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలకు నాయకులు, రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, ఆర్‌బీఎస్‌ మండల కో ఆర్డినేటర్‌ వొజ్జల అగ్గిరాములు, ఎలుక మల్లేశ్‌యాదవ్‌, సింగిల్‌విండో డైరెక్టర్‌ బైరి ప్రభాకర్‌, మ్యాన రవి, కల్లూరి మధు, రైతులు ఉన్నారు. ఇల్లంతకుంటలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, ఆరెపల్లిలో రైతులు, నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సెస్‌ డైరెక్టర్‌ గుడిసె ఐలయ్య, వైస్‌ ఎంపీపీ సుధ గోని శ్రీనాథ్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గొడుగు తిరుపతి, తదితరులు ఉన్నారు.logo