సోమవారం 13 జూలై 2020
Rajanna-siricilla - May 09, 2020 , 02:18:32

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

  • స్మార్ట్‌ రోడ్లు అస్తవ్యస్తంగా నిర్మిస్తే చర్యలు
  • కలెక్టర్‌ శశాంక

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ/కార్పొరేషన్‌: నగరంలో చేపడుతున్న స్మార్ట్‌సిటీ రోడ్ల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లు, అధికారులను కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. నగరంలో పలు చోట్ల సాగుతున్న నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. రోడ్డు విస్తరణకు సంబంధించి మ్యాప్‌ ప్రకారం కొలతలు వేసి, తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ రోడ్లలో ఫుట్‌పాత్‌ వైశాల్యం సరిగా ఉండేలా చూడాలన్నారు. పైపులైన్‌, యూజీడీ కనెక్షన్‌ సరిగా ఉన్నాయా? లేదా? పరిశీలించాలన్నారు. రోడ్లను అస్తవ్యస్తంగా నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  

ప్రతిరోజూ మిషన్‌ భగీరథ నీరు..

జిల్లాలోని ప్రజలకు వేసవిలో ప్రతిరోజూ మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని కలెక్టర్‌ శశాంక పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఆయన మిషన్‌ భగీరథ నీటి సరఫరాపై ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  జిల్లాలో ఎన్ని గ్రామాలకు పూర్తిస్థాయిలో ఎక్కువ మొత్తంలో నీరు వస్తుంది? ఎన్ని గ్రామాల్లో ప్రతిరోజూ తాగునీరు అందిస్తున్నారు? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్‌ క్రాంతి, ఎస్‌ఈ భద్రయ్య, ఈఈ రామన్‌, డీసీపీ సుభాష్‌, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, డీపీవో రఘువరన్‌, తదితరులు ఉన్నారు.logo