సోమవారం 23 నవంబర్ 2020
Rajanna-siricilla - May 09, 2020 , 02:18:33

అన్నం పెడుతూ.. అండగా ఉంటూ

అన్నం పెడుతూ.. అండగా ఉంటూ

  • నిరుపేదలకు దాతల భరోసా
  • నిత్యావసర సరుకులు, భోజన ప్యాకెట్ల పంపిణీ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అభాగ్యులకు అన్నదానాలు, భోజన ప్యాకెట్లు అందజేస్తూ దాతలు అండగా నిలుస్తున్నారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తూ భరోసా ఇస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు నిత్యం సమాజ సేవలో తరిస్తున్నారు. 

హుజూరాబాద్‌ టౌన్‌/ రూరల్‌/ శంకరపట్నం/ చిగురుమామిడి: హుజూరాబాద్‌ పట్టణంలోని ‘వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌' వద్ద లవ్‌ ఆర్మీ చారిటీ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేదలకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, చారిటీ నిర్వాహకు లు ఒక్కొక్కరికి రూ.వెయ్యి విలువ గల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పట్టణంలోని 50 మంది ఫొటో గ్రాఫర్లకు, 80 మంది విశ్వబ్రాహ్మణులకు మంత్రి ఈటల రాజేందర్‌ 15 కిలోల చొప్పున బియ్యం సమకూర్చగా, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌,  మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వడ్లూరి విజయ్‌కుమార్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. బుడగజంగాల కాలనీలో 25 మంది గర్భిణులకు అంగన్‌వాడీ టీచర్‌ కోటోజు జ్యోతిరాణి ఇంటింటికీ వెళ్లి పౌష్టికాహారం అందజేశారు. మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్‌లో 50 మంది వలస కార్మికులకు సర్పంచ్‌ కోడిగూటి శారద 5క్వింటాళ్ల బియ్యాన్ని సమకూర్చగా, తహసీల్దార్‌ బావుసింగ్‌  పంపిణీ చేశారు. అలాగే దాత గొట్టెముక్కల సంపత్‌రావు సహాయంతో మున్సిపల్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది 200 మందికి అన్నదానం ఏర్పాటు చేయగా, చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, పాలకవర్గ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు దగ్గరుండి వడ్డించారు.   సిర్సపల్లిలో 30 పేద కుటుంబాలకు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ సహకారంతో సింగిల్‌విండో చైర్మన్‌ కొండాల్‌రెడ్డి 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. శంకరపట్నం మండలంలోని పలు రేషన్‌ షాపుల వద్ద రైస్‌ డొనేషన్‌ బాక్స్‌ల ద్వారా 79.50 క్వింటాళ్ల బియ్యం సమకూరగా, మొలంగూర్‌లో ఎం పీపీ ఉమ్మెంతల సరోజన, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జగత్‌సింగ్‌ వలస కార్మికులకు పంపిణీ చేశారు. మిగతా గ్రామాల్లో వీఆర్వోలు బి య్యం అందజేశారు. చిగురుమామిడి మండలం ఇందుర్తిలో గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు గ్రామానికి చెందిన దాతలు చిట్టిరెడ్డి వేణు గోపాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి నిత్యావసరాలు,కూరగాయలు సమకూర్చగా, సర్పంచ్‌ స్వ రూప, ఉప సర్పంచ్‌ తోట సతీష్‌ పంపిణీ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

సిరిసిల్ల/ సిరిసిల్ల టౌన్‌/ సిరిసిల్లరూరల్‌/ గంభీరావుపేట/ ముస్తాబాద్‌/ కోనరావుపేట : సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పె ద్దూరులో 200 మందికి మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్‌ మాస్కులు, శానిటైజర్లను కమిషనర్‌ సమ్మ య్య, కౌన్సిలర్‌ కీర్తి చేతుల మీదుగా అందజేశారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి, దేశాయిపల్లెలో 500 మంది ఉపాధి కూలీలకు జడ్పీటీసీ మంజుల-రాంలింగారెడ్డి దంపతులు మాస్కులు పంపిణీ చేశారు. సర్పంచులు కొయ్యడ రమేశ్‌, బాలమల్లు కూ లీలకు అల్పాహారం ఏర్పాటు చేయగా, వైస్‌ ఎంపీపీ అంజ య్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వేణుగోపాలరావు, టీఆర్‌ఎస్‌ మాజీ మండలాధ్యక్షుడు అంకారపు రవీందర్‌ వడ్డించారు. సిరిసిల్ల పట్టణంలో వారాల సంఘం జిల్లా అధ్యక్షుడు దుబాల వెంకటేశం ఆధ్వర్యంలో 50 మంది పేదలకు మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నిజామాబాద్‌ నుంచి ఒడిశాకు కాలినడకన వెళ్తున్న వలస కూలీలకు గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌లో సెస్‌ డైరెక్టర్‌ దేవేందర్‌యాదవ్‌ వసతులు కల్పించి, రెండు పూటలా భోజనం పెట్టారు. ముస్తాబాద్‌ మండలం వెంకట్రావుపల్లె, బందనకల్‌, మోహినికుంట, పోతుగల్‌, గన్నెవానిపల్లెలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు, రైతులు, నిర్వాహకులకు పులిహోర, అంబలిని టీటీడీ బోర్డు సభ్యుడు రాములు పంపిణీ చేశారు. ఇక్కడ ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సహకార సంఘం చైర్మన్‌ తన్నీరు బాపురావు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్‌, తదితరులున్నారు. కోనరావుపేటతో పాటు ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో స్కావెంజర్లకు రూ.500 నగదుతో పాటు నిత్యావసరాలను డీటీఎఫ్‌ మండల అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ అందజేశారు.