శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - May 07, 2020 , 02:53:21

ఎరువులు నిల్వ చేసుకోవాలి

ఎరువులు నిల్వ చేసుకోవాలి

  • సిరిసిల్ల కలెక్టర్‌

కలెక్టరేట్‌/సిరిసిల్ల టౌన్‌: వానకాలం పంటల సాగుకు ఎరువులను సరిపడా నిల్వ చేసుకోవాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ వ్యవసాయాధికారులకు సూచించారు. సిరిసిల్లలోని స్వశక్తి పొదుపు భవన్‌లో ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల సరఫరాపై వ్యవసాయాధికారులు, జిల్లా సహకారశాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. వానకాలం సీజన్‌ ప్రారంభానికి కొద్దిరోజులే ఉండడంతో గ్రామ స్థాయిలోని అన్ని క్లస్టర్‌ పాయింట్లలో సరిపడా ఎరువులు నిల్వ చేసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు వెంటనే అన్‌లోడ్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ జిల్లా వ్యవసాయాధికారి రణధీర్‌రెడ్డి, సహకార అధికారి బుద్ధనాయుడు తదితరులున్నారు. అలాగే సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్‌ అంజయ్యతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. తుదిదశలో ఉన్న పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. ‘ది సిటీస్‌ ఆఫ్‌ సిరిసిల్ల, వేములవాడ’ పేరుతో రూపొందించిన లఘు చిత్రం సీడీని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆవిష్కరించారు. దీనిని నిర్మించిన సిద్దుల శ్రీనివాస్‌, కోడం సంతోష్‌ను అభినందించారు.