గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - May 07, 2020 , 02:53:26

నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

టవర్‌సర్కిల్‌: స్మార్ట్‌సిటీ పనుల కారణంగా గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని టౌన్‌ ఏడీఈ అంజయ్య తెలిపారు. 11కేవీ కమాన్‌ ఫీడర్‌ పరిధిలోని కమాన్‌, వాసవీకాలనీ, లక్ష్మీనగర్‌, రాఘవేంద్రనగర్‌, పద్మశాలి స్ట్రీట్‌, శ్రీనివాస థియేటర్‌, క్యాన్సర్‌ హాస్పిటల్‌, గాయత్రీనగర్‌, మధుగార్డెన్‌ వెనుక భాగం, షాషామహల్‌ ప్రాంతాల్లో ఉదయం 8గంటల నుంచి మధ్యా హ్నం 12వరకు, 11కేవీ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌, ప్రతిమ మల్టీప్లెక్స్‌, బస్టాండ్‌ ఏరి యా, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌, జడ్పీ ఆఫీస్‌ ఏరియాల్లో ఉదయం 8 గంటల నుంచి ఒంటి గంట వరకు కరెంట్‌ ఉండదన్నారు. 11కేవీ రాంనగర్‌ ఫీడర్‌ పరిధిలోని రాంనగర్‌, శ్రీహరినగర్‌, కుర్మవాడ, మంకమ్మతోట, సంతోషినగర్‌ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 11 వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.  


logo