శనివారం 11 జూలై 2020
Rajanna-siricilla - May 07, 2020 , 02:53:23

అభాగ్యులకు అభయమిస్తూ..

అభాగ్యులకు అభయమిస్తూ..

  • పేదలు, వలస కూలీలకు అన్నదానం
  • నిత్యావసర సరుకులు అందజేత

ఆపద సమయంలో అభాగ్యులకు అభయమిస్తూ పలువురు సేవాతత్పరతను చాటుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పేదలు, వలసకూలీలు, యాచకులు పస్తులుండకుండా కొందరు వారి కడుపు నింపుతున్నారు. మరి కొందరు సరుకులు అందజేస్తూ, ఆర్థికంగా చేయూతనిస్తూ అండగా ఉంటున్నారు. 

కరీంనగర్‌ నెట్‌వర్క్‌: కరీం‘నగరం’లోని 60వ డివిజన్‌లో 150 మంది పేదలకు మేయర్‌ సునీల్‌రావు, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ నిత్యావసరాలు పంపిణీ చేశారు. వాగేశ్వ రి కళాశాల యజమాని గోపాల్‌రెడ్డి, సుద్దాల శ్రీనివాస్‌ ఉన్నా రు. 43వ డివిజన్‌లో పారిశుధ్య కార్మికులను మేయర్‌ సన్మానించి, సరుకులు పంచారు. కార్పొరేటర్‌ ప్రసాద్‌ ఉన్నారు. 25వ డివిజన్‌లో బ్యాంకు ఉద్యోగి శరత్‌కుమార్‌ కూరగాయలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. కార్పొరేటర్‌ ఎడ్ల సరిత అశోక్‌ ఉన్నారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు 50 పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. పుట్టపర్తి సత్యసాయిబాబా మాతృమూర్తి ఈశ్వరాంబ జయంతిని పురస్కరించుకుని సత్యసాయి సేవా సంస్థ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పాల్తెపు లింగమూర్తి ఆధ్వర్యంలో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేశారు. హౌసింగ్‌బోర్డుకాలనీలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం అందజేశారు. వావిలాలపల్లిలోని అల్ఫోర్స్‌ ఈ టెక్నో పాఠశాలలో విద్యాసంస్థల చైర్మన్‌ వీ నరేందర్‌రెడ్డి ‘పాత్రికేయులకు చేయూత’లో భాగంగా 150 మంది ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు, ఫొటో, వీడియో జర్నలిస్టులకు రూ.1.50లక్షల విలువైన బియ్యం పంపిణీ చేశారు. హుజూరాబాద్‌ మున్సిపల్‌ ఆధ్వర్యంలో దాతల సహాయంతో పట్టణంలో పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది 200 మందికి అన్నదానం చేశారు. హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ గంగిశెట్టి జగదీశ్వర్‌ తన తల్లి మధురమ్మ జ్ఞాపకార్థం పది మంది మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు తలా 15కిలోల బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు అందించారు. వలస కార్మికులు, బాటసారులకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందగిరి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 200మందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. జమ్మికుంటలో బాల్యమిత్రుల సేవా సమితి(ఎస్సెస్సీ 1983-84బ్యాచ్‌) ఆధ్వర్యంలో అల్పాహారం, మధ్యా హ్న భోజన ప్యాకెట్లు సమకూర్చగా, మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, కమిషనర్‌ అనిసూర్‌ రషీద్‌, సీఐ సృజన్‌రెడ్డి అందజేశారు. జమ్మికుంట మండలం మాచనపల్లిలో బొల్లవేన శ్రీకాంత్‌యాదవ్‌ తన బర్త్‌డే సందర్భంగా 70మంది పేదలకు నిత్యావసరాలు, పండ్లు పంపిణీ చేశాడు. రామడుగులో విద్యు త్‌ రెవెన్యూ ఆఫీస్‌(గుండి) ఉద్యోగుల ఆధ్వర్యంలో 20 మంది నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొత్తపల్లి పట్టణంలో చేనేత కార్మికులకు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సమకూర్చిన నిత్యావసరాలను మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు పంపిణీ చేశారు. ఆరో వార్డులోని అంగన్‌వాడీ కేంద్రం-2లో గర్భిణులు, బాలింత లు, చిన్నపిల్లలకు మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, కౌన్సిలర్‌ గున్నాల విజయ పౌష్టికాహారం అందజేశారు. గంగాధర మండ లం చెర్లపల్లి(ఎన్‌)లో  నిత్యావసరాలు అందజేసిన పెద్దల్ల లింగ య్య, బెల్లపు భూమయ్యను యునిసెఫ్‌ ప్రతినిధులు సన్మానించారు. ‘మేమున్నాం మీకోసం’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వినాయక భోజనాలయంలో ఆహారం పంపిణీ చేశారు. కళాభారతి ఎదురుగా, కోర్టు చౌరస్తాలో 500 మందికి అన్నదానం చేశారు.  తీగులగుట్టపల్లిలో మున్సిపల్‌ సిబ్బందికి డాక్టర్‌ బీఎన్‌ రావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఇక్కడ డాక్టర్‌ బీఎన్‌రావు, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్‌, కాశెట్టి లావణ్య, తదితరులున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా..

రాజన్న సిరిసిల్ల నెట్‌వర్క్‌: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ రావు సొంత ఖర్చులతో అందించిన బియ్యం, నిత్యావసరాలను సిరిసిల్లలోని సినారె కళా మందిరంలో 100మంది పాస్టర్లకు టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ పంపిణీ చేశారు. తంగళ్లపల్లి మండ లం తాడూరులోని 500 మంది ఉపాధి కూలీలకు మాస్కులు, 40 మంది పంచాయతీ కార్మికులకు నిత్యావసర సరుకులను జడ్పీటీసీ మంజుల-రాంలింగారెడ్డి దంపతులు, వేణుగోపాలరావు, అంకారపు రవీందర్‌ అందజేశారు. కొండూరి, ఎంపీపీ మానస ఉన్నారు. తంగళ్లపల్లిలో వందమంది పేద కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసరాలను ఆసాని లక్ష్మారెడ్డి అం దించారు. కరీంనగర్‌ నుంచి కామారెడ్డికి కాలినడకన వెళ్తున్న వలస కూలీ కుటుంబానికి గోరంట్యాలలో జడ్పీటీసీ విజయ-లక్ష్మణ్‌, సర్పంచ్‌ అంజమ్మ-బాల్‌రెడ్డి భోజనం ప్యాకెట్లు, వెయ్యి  అందజేశారు. ఎల్లారెడ్డిపేటలో వడ్నాల గాలయ్య ఆధ్వర్యంలో 50 మంది నిరుపేదలు, సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో 150 మంది పేదలకు అన్నదానం చేశారు. సిరిసిల్లకు చెందిన అక్షిత ఫౌండేషన్‌ నిర్వాహకురాలు అక్షిత, టీఆర్‌ఎస్‌ మహిళావిభాగం మండల అధ్యక్షురాలు సునీతతో కలిసి దుమాలలోని తురక్కాశి గుడిసెల్లో 20 కుటుంబాలకు, ఎల్లారెడ్డిపేటకు చెందిన కనకదుర్గ సూపర్‌ మార్కెట్‌ ఆధ్వర్యంలో 175 మంది పేదలకు, ముస్కానిపేటలో ఆరుగురు జీపీ సిబ్బందికి, 21 మంది నిరుపేదలకు సర్పంచ్‌ లక్ష్మి నిత్యావసరాలను పంపిణీ చేశారు. చందుర్తి ఎమ్మార్సీలో డీటీఎఫ్‌ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లోని పాఠశాలలకు చెందిన 30 మంది స్కావెంజర్లకు ఎంపీపీ లావణ్య నిత్యావసర సరుకులు అందజేశారు. 


logo