బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - May 06, 2020 , 01:54:36

కరుణ చూపుతూ.. కడుపు నింపుతూ..

కరుణ చూపుతూ.. కడుపు నింపుతూ..

  • నిరుపేదలకు అండగా నిలుస్తున్న దాతలు
  • నిత్యావసర సరుకుల పంపిణీ, అన్నదానాలు
  • ముందుకొస్తున్న స్వచ్ఛంద సంస్థలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాతలు నిరుపేదలపై కరుణ చూపుతూ.. అన్నార్తుల కడుపు నింపుతూ అండగా నిలుస్తున్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ, అన్నదానాలు నిర్వహిస్తూ ఆసరాగా ఉంటున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలుసేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నాయి.

కరీంనగర్‌ నెట్‌వర్క్‌: కరీంనగర్‌ పద్మనగర్‌లోని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో గోపాలమిత్రలు, ఘనీకృత వీర్య ఆబోతుల క్షేత్రంలో పనిచేస్తున్న కార్మికులకు తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ చల్మెడ రాజేశ్వర్‌రావు మాస్కులు, శానిటైజర్స్‌ను పంపిణీ చేశారు. కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియం వద్ద హైదరాబాద్‌కు చెందిన దాత వెంకి సహకారంతో రవివర్మ ఆధ్వర్యంలో పలువురు ఫొటోగ్రాఫర్లకు మేయర్‌ వై సునీల్‌రావు నిత్యావసరాలను పంపిణీ చేశారు. 17వ డివిజన్‌లోని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 25 వలస కుటుంబాలకు 5 రకాలతో కూడిన నిత్యావసరాలను ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యానగర్‌ శాఖ ఆధ్వర్యంలో అందజేశారు. 55వ డివిజన్‌లో పోలు సత్యనారాయణ సహకారంతో పారిశుధ్య కార్మికులకు సరుకులను కార్పొరేటర్‌ జితేందర్‌ పంపిణీ చేశారు. కరీంనగర్‌ వాసుదేవా దవాఖాన చైర్మన్‌ డాక్టర్‌ ఎలగందుల శ్రీనివాస్‌, అలయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో వందమందికి నిత్యావసరాలను పంపిణీ చేశారు. కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌ బైపాస్‌ రోడ్డులోని మున్నూరుకాపు సంక్షేమ సంఘం భవనం వద్ద బొమ్మకల్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వలస కూలీలకు  అల్పాహారం అందజేశారు. కరీంనగర్‌ రూరల్‌ పోలీసుల సహకారంతో వారిని స్వరాష్ర్టానికి తరలించారు. రామడుగు మండలం వెలిచాల పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలోని రైతులు, హమాలీలకు సర్పంచ్‌ వీర్ల సరోజన మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్‌ కటుకం రవీందర్‌ ఆధ్వర్యంలో కొండగట్టులోని కోతులు, అనాథలకు 200 డజన్ల అరటిపండ్లు, నాలుగు బస్తాల బోల్‌పేలాలు, 150 కొబ్బరి బొండాలు, 10 క్వింటాళ్ల బియ్యం, 20 కిలోల పుట్నాలు అందించారు. వీణవంక మం డల కేంద్రంలోని 80 మంది నాయీ బ్రాహ్మణులకు మంత్రి ఈటల రాజేందర్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా, మంగళవారం టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు మోటం వెంకటేశ్‌, ఈటల జనసేన మాజీ మండలాధ్యక్షుడు దాసారపు రాజు వారికి అందజేశారు. హుజూరాబాద్‌ పట్టణంలో పలువురు దాతలు మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి సుమారు 300 మందికి అన్నదానం చేశారు. వరంగల్‌ రోడ్డులోని వైష్ణవి సూపర్‌ మార్కెట్‌ ఆవరణలో వంద మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 25కిలోల బియ్యంతో పాటు  నిత్యావసర సరుకులు హుజూరాబాద్‌ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వడ్లూరి విజయ్‌కుమార్‌ తహసీల్దార్‌ బావుసింగ్‌తో కలిసి అందజేశారు. 16వ వార్డు కౌన్సిలర్‌ మారపెల్లి సుశీల-సంజీవరావు కుటుంబసభ్యులు 30మంది మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. జమ్మికుంట మండలంలోని బాల్యమిత్ర సేవాసమితి ఆధ్వర్యంలో 100 మంది పేదలకు నిత్యావసర సరుకులు మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు అందజేశారు. తిమ్మాపూర్‌ మండలంలోని నల్లగొండలో మాజీ సర్పంచ్‌ దన్నమనేని సునీతాసురేందర్‌రావు ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌ 350 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎల్‌ఎండీ కాలనీలోని ఎమ్మార్సీ భవనంలో మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న 60 మంది సర్వీస్‌ పర్సన్లకు, గన్నేరువరం మండలం జంగపెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని పారిశుధ్య కార్మికులు, మధ్యాహ్న భోజన సిబ్బందికి పీఆర్‌టీయూ జిల్లా మండల శాఖ ఆధ్వర్యం లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. తిమ్మాపూర్‌ రూరల్‌ మండలంలోని రామకృష్ణకాలనీలో గల ఉపఘ్నహోమ్స్‌లోని ఉపాధ్యాయులు కారం మంజుల, సమతలు 100 మంది వలస కార్మికులకు పులిహోర ప్యాకెట్లను అందజేశారు. ఇందిరానగర్‌లో ప్రియా డెయిరీ ఆధ్వర్యంలో వంద మందికి నిత్యావసర సరుకులను ఏర్పాటు చేయగా, ట్రైనీ ఐపీఎస్‌ నితికాపంత్‌ పంపిణీ చేశారు. సైదాపూర్‌ మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 200 మంది ఆటోడ్రైవర్లకు ఎంపీపీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

వేములవాడ రూరల్‌ మండలం బాలరాజుపల్లిలో జడ్పీటీసీ వాణి, సర్పంచ్‌ తిరుపతి ఆధ్వర్యంలో 50కుటుంబాలకు నిత్యావసర వస్తువులను జడ్పీ అధ్యక్షురాలు అరుణ అందజేశారు. డీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఎం ఈవో కార్యాలయంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. మున్సిపల్‌ అధ్యక్షురాలు మాధవి, ఎస్‌ఐ సౌమ్యారెడ్డి ఉన్నారు. పద్మశాలీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 120మంది పేదలకు నిత్యావసరాలను సిరిసిల్ల మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ, ఉమ్మడి జిల్లా వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్లలో 110మంది వైష్ణవ అర్చకులకు నిత్యావసరాలను పంపిణీ చేశా రు. ఎల్లారెడ్డిపేటలో మీసం యాదగిరి తన భార్య యశోద స్మారకార్థం 50 మంది వలస కూలీలు, పేదలకు, సత్యసాయి సేవాసమితి సభ్యులు బొ ప్పాపూర్‌, గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేటకు చెందిన 90 మంది పేదలకు అన్నదానం చేశారు. ఎల్లారెడ్డిపేటకు చెందిన బుస్స సోమలింగం, పుల్లయ్యోల్ల శ్రీనివాస్‌, బొమ్మకంటి వెంకన్న, బొమ్మకంటి శ్రీనివాస్‌, రాజయ్య, అల్లాడి ఆంజనేయులు, రాజేశం గుప్తా, గాండ్ల సత్యనారాయణ 200 పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. హైదరాబాద్‌కు చెందిన భవానీరెడ్డి ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లిలో పేద, సంచారజాతుల 50 కుటుంబాలకు దాసరి గణేశ్‌, చెంజర్ల దేవయ్య చేతులమీదుగా, అల్మాస్‌పూర్‌లో అక్షిత బ్యూటీపార్లర్‌ నిర్వాహకులు 10 కుటుంబాలకు, తంగళ్లపల్లిలో పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, సోదరులు కృష్ణారెడ్డి, విజయేందర్‌రెడ్డి, ఫ్రెండ్స్‌క్లబ్‌ చైర్మన్‌ లక్ష్మీరాజం చేతుల మీదుగా 50మంది పేదలకు నిత్యావసరాలను, రామన్నపల్లెలో 50 మం ది ఉపాధి కూలీలకు సర్పంచ్‌ రంగయ్య మాస్కులను అందించారు. వేములవాడలో ఆద్యా గోలి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 24వ వార్డు కౌన్సిలర్‌ ఉమారాణి శ్రీనివాస్‌ 40పేద కుటుంబాలకు నిత్యావసరాలను, కోనరావుపేటలో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లను ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌ అందజేశారు. కొదురుపాకలో 28వ రోజు టీఆర్‌ఎస్‌ నాయకులు 200 మంది వలస కూలీలకు అన్నదానం చేశారు.