మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - May 06, 2020 , 01:54:37

మద్యం దుకాణాల్లో ‘ఎక్సైజ్‌' తనిఖీలు

మద్యం దుకాణాల్లో ‘ఎక్సైజ్‌' తనిఖీలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతోపాటు మంచిర్యాల, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని మద్యం దుకాణాలను మంగళవారం ఎక్సైజ్‌ శాఖ అధికారులు తనిఖీ చేశారు. లాక్‌డౌన్‌ సందర్భంగా వైన్స్‌లను మూసివేసే సమయంలో ఉన్న స్టాక్‌, ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాక్‌ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.