‘ప్రేమ, క్రైమ్ యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలి’ అని అన్నారు మైత్రీ మూవీస్ అధినేత నవీన్ ఎర్నేని. ‘రాంగ్ నెంబర్’ సినిమా ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ను ఆయన విడుదలచేశారు. ఆర్వీ సాంబశివరావు దర్శకుడు. మారుతీరామ్, జియోడార్ల, అజయ్‌ఘోష్ ప్రధాన పాత్రల్ని పోషించారు. ఆర్వీస్, ఫర్హానా నస్రీన్ నిర్మాతలు. చిత్రదర్శకుడు మాట్లాడుతూ ‘రాంగ్ నంబర్ ఓ జంట జీవితంలో ఎలాంటి అలజడి రేపిందన్నది ఉత్కంఠను పంచుతుంది. త్వరలో సినిమాను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. నవ్యమైన అంశాలతో రూపొందిన చిత్రమిదని హీరో పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ హేమకాంత్.
ఇవి కూడా చదవండి:
ఈ సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం!
తెలుగులో నిహారిక కొణిదెల నటించిన తమిళ చిత్రం
అండర్‌వరల్డ్ గ్రూప్ నేపథ్యంలో ‘శుక్ర’