టీమిండియా ఆలర్ రౌండర్ హార్ధిక్ పాండ్యా .. నటాషా స్టాన్ కోవిచ్ను లాక్డౌన్ సమయంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నటాషా తరచు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన భర్త హార్ధిక్ పాండ్యా, కుమారుడు అగస్త్యతో కలిసి చేసిన స్టైలిష్ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
నటాషా.. సెర్బియాకు చెందిన నటి కాగా, 2013లోకి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటాషా.. ప్రకాష్ ఝూ దర్శకత్వంలో వచ్చిన ‘సత్యాగ్రహ’ చిత్రంతో పేరు సంపాదించుకుంది. ఫిలిప్స్, కాడ్బరీ, టెట్లీ, జాన్సన్ అండ్ జాన్సన్ వంటీ తదితర బ్రాండ్లకు పనిచేసింది. బిగ్‌బాస్ హిందీ ఎనిమిదవ సీజన్లో (2014), నాచ్బాలియే తొమ్మిదవ సీజన్లో (2019) పాల్గొంది. రాప్ సింగర్ బాద్షా 2014లో రూపొందించిన రెండు మ్యూజిక్ వీడియోల్లో నటాషా అందాలతో అదరగొట్టింది. 2014లో ‘అరిమ నంబి’ అనే తమిళ సినిమా, 2016లో ‘దానా కయోను’ అనే కన్నడ సినిమాల్లో ఐటెమ్ నంబర్స్ చేసి అదరగొట్టింది. నటాషా ‘ది హాలిడే’ అనే వెబ్ సిరీస్‌లో నటించి హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.ఇక హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.