శనివారం 11 జూలై 2020
Rajanna-siricilla - Apr 13, 2020 , 02:46:06

డోర్‌ డెలివరీ

డోర్‌ డెలివరీ

 • ఆర్డరిస్తే ఇళ్ల వద్దకే నిత్యావసరాలు, పండ్లు, కూరగాయలు
 • కరోనా ప్రభావిత ప్రాంతాల్లో కరీం‘నగర పాలక సంస్థ’ సేవలు
 • అందుబాటులోకి మొబైల్‌ కూరగాయల వాహనాలు
 • ముందుకు వస్తున్న పలు ప్రైవేట్‌ సంస్థలు
 • వినియోగదారులకు ప్రత్యేకంగా ఫోన్‌ నంబర్లు 

లాక్‌డౌన్‌తో ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారా..? నిత్యావసర సరుకులు ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారా..? కూరగాయలు లేదా పండ్లు లేవని చింతిస్తున్నారా..? మరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! మీరు ఆర్డర్‌ చేస్తే మీ ఇంటి వద్దకే నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు వస్తాయి! కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఈ తరహా సేవలు ఇప్పటికే అందుబాటులోకి రాగా, పలు ప్రైవేట్‌ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. వినియోగదారులకు ప్రత్యేకంగా ఫోన్‌ నంబర్లు ఇస్తూ, ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు డోర్‌ డెలివరీ చేస్తున్నాయి.

- కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ

కరీం‘నగరం’లో మొబైల్‌ మార్కెట్లు..  

నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలను ఇండ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు ఇండ్ల వద్దకే చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల ఒకటి నుంచి పలు డివిజన్లలో మొబైల్‌ కూరగాయల వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. 1, 2 డివిజన్ల పరిధిలోని అపోలో దవాఖాన, విద్యారణ్యపురి, బుట్టిరాజరాం కాలనీ వాసులు 9849895829 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. అలాగే 9, 31 డివిజన్ల పరిధిలోని పోచమ్మవాడ, కోతిరాంపూర్‌, అలకాపురికాలనీ, లక్ష్మీనగర్‌ వాసులు 9963865677లో.. 17, 39 పరిధిలోని విద్యానగర్‌, రేకుర్తి, హిందుపురికాలనీల ప్రజలు 9618811564లో.. 40, 33 డివిజన్లలోని వావిలాలపల్లి, బ్యాంకు కాలనీ, మెహర్‌నగర్‌, భగత్‌నగర్‌, గోదాంగడ్డ ప్రజలు 8500066486లో.. 58, 59 డివిజన్లలోని జ్యోతినగర్‌ వాసులు 6302494802 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. 

నగరంలో ముందుకొచ్చిన ప్రైవేట్‌ సంస్థలు..

 • ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు అందించేందుకు నగరంలో పలు ప్రైవేట్‌ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. ఈ మేరకు నగరపాలక సంస్థ అధికారులను సంప్రదించి, తాము డోర్‌ డెలివరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. వాటికి సంబంధించి వివరాలను కూడా అధికారులు ప్రకటించారు. 
 • s‘స్పెన్సర్స్‌' సంస్థ ఉదయం 6నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు సేవలందిస్తున్నది. 9717888371, 93907 32811, 9949366140 నంబర్లలో సంప్రదించవచ్చు.
 • s‘మై సిటీ సర్వీస్‌' సంస్థ కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డోర్‌ డెలివరీ సదుపాయాన్ని కల్పించింది. 7842847886లో ఆర్డర్‌ చేయవచ్చు.
 • sపండ్లు, కూరగాయల కోసం ‘ఎఫ్‌2హెచ్‌ సర్వీస్‌' వారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సేవలందిస్తున్నారు. 9030662999లో లేదా WWW.f2hknr.in లో సంప్రదించవచ్చు
 • s‘రిలయన్స్‌ స్మార్ట్‌' సంస్థ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డోర్‌ డెలివరీ చేస్తున్నది. 9398735983, 9676991623లో లేదా www.reliancesmart.inలో సంప్రదించవచ్చు. 
 • s‘డీ మార్ట్‌' సంస్థ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు డోర్‌ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నది. https://play.google.com/store/apps/details?id=in.dmartలో వివరాలు ఎంట్రీ చేస్తే, ఇంటి వద్దకే సామగ్రి పంపిస్తున్నది.
 • s‘స్టోర్‌ ఫ్రంట్‌' సంస్థ ఉదయం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు డోర్‌ డెలివరీ అందిస్తున్నది. https: //play.google.com/store/apps/details?id=com.vainsn.storefrontలో సంప్రదించవచ్చు. 

 రామగుండంలోనూ సేవలు.. 

గోదావరిఖని టౌన్‌: పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలోనూ హోం డెలివరీ సేవలను అందిస్తున్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ కోరారు. నిత్యావసర సరుకుల కోసం ఎన్టీపీసీలోని సూపర్‌ మార్కెట్‌ (9705908967), మార్కండేయ కాలనీలో రాధాకృష్ణ సూపర్‌ మార్కెట్‌ (9849537838), ఎల్‌జీఎస్‌ సూపర్‌ మార్కెట్‌ (9550950893), ఏబీ సూపర్‌ మార్కెట్‌ (9550479349), ఎస్‌వీ సూపర్‌ మార్కెట్‌ (83414005050), అశోక సూపర్‌ మార్కెట్‌ (9849838590), అడ్డగుంటపల్లిలోని సిరిచందన సూపర్‌ మార్కెట్‌ (9949757142)ను సంప్రదించాలని ఆయన సూచించారు.


logo