ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Apr 10, 2020 , 02:10:36

మేము సైతం..

మేము సైతం..

  • మాస్కుల తయారీలో మెప్మా 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా నివారణకు కరీంనగర్‌ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) తన వంతు కృషి చేస్తున్నది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు ఆర్డర్లు ఇచ్చి మాస్కులు తయారు చేయిస్తున్న సంస్థ, తక్కువ ధరకే వివిధ శాఖలకు అందిస్తున్నది. కరీంనగర్‌టౌన్‌ మిషన్‌ ఆధ్వర్యంలో పీడీ పవన్‌కుమార్‌ నేతృత్వంలో టౌన్‌ మిషన్‌ కో ఆర్డినేటర్‌ ముదుగంటి అనితారెడ్డి పర్యవేక్షణలో వీటిని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం సీతారాంపూర్‌, భాగ్యనగర్‌, భగత్‌నగర్‌, కోతిరాంపూర్‌, తీగలగుట్టపల్లి ఏరియాల్లోని 13 స్వయం సహాయక బృందాల్లోని 59 మంది సభ్యులు మాస్కుల తయారీలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 20 వేల కు పైగా నాణ్యమైన మాస్కులు సిద్ధం చేశారు. వీటి లో సగం మున్సిపల్‌ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు అందించగా, మిగతా సగం పో లీస్‌, రెవెన్యూ తదితర శాఖలకు అందించారు. క రీంనగర్‌ బల్దియా కమిషనర్‌ క్రాంతి వీటి తయారీపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. డిమాండ్‌ మే రకు ఆర్డర్లు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నా రు. ప్రభుత్వ శాఖలకు కేవలం 10కి, ఇతరులకు 12కే అందిస్తున్నామని తెలిపారు. కాగా మార్కె ట్లో లభిస్తున్న యూజ్‌ అండ్‌ త్రో ఒక్కో మాస్కు కనీస ధర 30 అంతకంటే ఎక్కువ పలుకుతుండగా, వీరు అంతకంటే తక్కువకే అన్ని ప్రమాణాలతో కూడిన మాస్క్‌లను అందిస్తున్నారు.


logo